E-Paper
Advertisement

Flipkart Buy Buy Sale 2025: వివో ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చిన సూపర్ సేల్.. అతి తక్కువ ధరకే వివో T4 అల్ట్రా!

Flipkart Buy Buy Sale 2025: వివో ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చిన సూపర్ సేల్.. అతి తక్కువ ధరకే వివో T4 అల్ట్రా!
Advertisement

Flipkart Buy Buy Sale 2025: సరసమైన ధరకే వివో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. తాజాగా ప్రారంభమైన ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్ ద్వారా వివో స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. భారత మార్కెట్‌లోకి ఈ ఏడాది జూన్‌లో ప్రవేశించిన ‘వివో T4 అల్ట్రా’ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అత్యంత ఆకర్షణీయమైన ధరలో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బై బై సేల్ ద్వారా 50MP OIS కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద RAM & స్టోరేజ్ వంటి ప్రత్యేక ఫీచర్ల కలిగిన వివో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

12% తగ్గింపు:

వివో T4 అల్ట్రా ఫోన్ ప్రారంభ ధర రూ.40,999. అయితే ఫ్లిప్‌కార్ట్ సేల్ ద్వారా ఈ హ్యాండ్‌సెట్‌పై 12 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత వివో T4 అల్ట్రా ఫోన్ రూ.35,999 ధరకు లభిస్తుంది. అదనంగా, ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్లతో ధరను మరింత తగ్గించుకోవచ్చు.

డిస్కౌంట్ & ఆఫర్లు ఇలా..

Advertisement

* ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ.2,750 తగ్గింపు

* SBI బ్యాంక్ కార్డులపై రూ.2,632 తగ్గింపు

Advertisement

* HDFC, SBI కార్డులపై రూ.2,000 తగ్గింపు

* ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్

* పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.35,050 ఆఫర్

బెస్ట్ పెర్ఫార్మెన్స్:

ఈ హ్యాండ్‌సెట్ 6.67-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 2800×1260 పిక్సెల్ రిజల్యూషన్, 1600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ తో పర్ఫార్మెన్స్ సపోర్ట్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 9300+ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఇది Android 15 Funtouch OS ఆధారంగా పనిచేస్తుంది.

కెమెరా & ఫీచర్స్:

ఇక ఫోటోలు, వీడియోల కోసం, ఈ ఫోన్ OIS సపోర్ట్‌తో 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. అదనంగా, సెకండరీ కెమెరా 8MP, మూడవ కెమెరా 50MP ఉండగా, ఫ్రంట్ సైడ్‌లో 32MP కెమెరా ద్వారా క్లియర్ సెల్ఫీలు తీసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 5,500mAh బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది. అంతేకాక, ఇది IP64 రెసిస్టెంట్‌గా ఉంటుంది. అలాగే Wi-Fi, బ్లూటూత్, GPS వంటి ఇతర ఫీచర్లను కూడా అందిస్తుంది.

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×