E-Paper
Advertisement

IndiGo Refund: ఇండిగో రీఫండ్ రూ.610 కోట్లు.. కేంద్రం ప్రకటన

IndiGo Refund: ఇండిగో రీఫండ్ రూ.610 కోట్లు.. కేంద్రం ప్రకటన
Advertisement

IndiGo Refund: ఇండిగో విమానాల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా ఆరో రోజు ఇండిగో విమానాల రద్దు కొనసాగింది. అయితే రద్దైన విమానాల వాపసులను డిసెంబర్ 7 రాత్రి 8 గంటల లోపు రీఫండ్ చేయాలని కేంద్రం ఇండిగోను ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు రూ.610 కోట్ల వాపసులను ప్రాసెస్ చేసినట్లు ఇండిగో ప్రకటించింది. అలాగే 3,000 లగేజీలను డెలివరీ చేసినట్లు పేర్కొంది.

రూ.610 కోట్లు రీఫండ్

ఇండిగో విమానాల టికెట్ల రీఫండ్‌కు సంబంధించి ఇప్పటి వరకు రూ.610 కోట్ల మేర చెల్లింపులు చేసినట్లు కేంద్ర పౌర విమానయానశాఖ ప్రకటించింది. విమానాల రద్దుతో ప్రభావితమైన ప్రయాణాలను రీషెడ్యూల్ చేసేందుకు ఎటువంటి అదనపు ఫీజులు వసూలు చేయొద్దని కేంద్రం ఆదేశించింది. టికెట్ల రీఫండ్‌ ప్రక్రియను ఆదివారం సాయంత్రం నాటికి పూర్తి చేయాలని, లగేజీని రెండు రోజుల్లో డెలివరీ చేయాలని కేంద్రం శనివారం ఇండిగోను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా చెల్లింపులు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ సంక్షోభం నుంచి బయటపడటంతో పాటు సర్వీసుల పునరుద్ధరణకు సీఈవో, బోర్డు సభ్యులు కలిసి క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.

Advertisement

ఇండిగో విమానాలు పూర్తి స్థాయిలో క్రమబద్దీకరించేందుకు అన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విమాన కార్యకలాపాలు క్రమంగా పూర్వస్థితికి వస్తున్నాయని, ఇండిగో పనితీరు క్రమంగా మెరుగుపడుతుందని పేర్కొంది. విమాన కార్యకలాపాలు శుక్రవారం 706 నుంచి శనివారం 1,565 కు పెరిగాయి. నేటికి 1,650కి చేరుకునే అవకాశం ఉందని ఇండిగో తెలిపింది.

ఇవాళ 650 విమానాలు రద్దు

విమాన సర్వీసుల క్రమంగా పూర్వస్థితికి వస్తున్నప్పటికీ, దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో ఆదివారం గందరగోళం కొనసాగింది. దేశవ్యాప్తంగా మొత్తం 650 ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. హైదరాబాద్, కోల్‌కతా, దిల్లీలో ఎక్కువ విమానాలు రద్దు అయ్యాయి.

Advertisement

Also Read: Indigo Flights: ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసులు..

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 115 సర్వీసులు రద్దు అయ్యాయి. దిల్లీ ఎయిర్ పోర్టులో 109 విమానాలు రద్దు అయ్యాయి. కోల్‌కతాలో 76 విమాన సర్వీసులు నిలిచిపోయాయి.

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×