E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ రిలీజ్ పై క్లారిటీ.. ఆకట్టుకున్న న్యూ ఇయర్ పోస్టర్ !

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ రిలీజ్ పై క్లారిటీ.. ఆకట్టుకున్న న్యూ ఇయర్ పోస్టర్ !
Advertisement

Ustaad Bhagat Singh: 2025 వ సంవత్సరానికి గుడ్ బై చెబుతూ.. 2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు వరుస సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రావడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలకు సంబంధించిన కీలక అప్డేట్స్ వెల్లడించారు. కొత్త సంవత్సరం సందర్భంగా పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

దేఖల్లేంగే సాల.. చూసినం లే చాలా..

ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమా నుంచి నిర్మాతలు మరొక అప్డేట్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేస్తూ.. సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఒక చేతిలో గన్ మరో చేతిలో రేడియో పట్టుకొని సూపర్ లుక్ లో కనిపించిన నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర బృందం.. అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేయడమే కాకుండా ఈ ఏడాది అందరికీ సక్సెస్ రావాలని కోరుకున్నారు. అలాగే ఈ ఏడాది మీకు ఏదైనా చాలెంజ్ విసిరితే “దేఖల్లేంగే సాల.. చూసినం లే చాలా” అని చెప్పండి అంటూ ఈ పోస్టర్ విడుదల చేశారు.

2026 సమ్మర్ రిలీజ్..

Advertisement

ఇక ఈ సినిమాని 2026 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. 2026 ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అయితే మార్చిలోనే విడుదల కాబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి. మార్చ్ 27వ తేదీ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా వాయిదా పడితే ఆ స్థానంలోకి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కాబోతుందంటూ వార్తలు వచ్చాయి కానీ పెద్ద సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ 2026 సమ్మర్ లోనే విడుదల కాబోతుందని తెలిపారు.

Advertisement

ఇక ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్లుగా శ్రీలలతో పాటు రాశి కన్నా నటించి సందడి చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
దేఖల్లేంగే సాల.. చూసినం లే చాలా అంటూ సాగిపోయే పాటను విడుదల చేయగా, ఈ పాటకు భారీ స్థాయిలో ఆదరణ లభించింది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీపసాద్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

Also Read: Lenin First Single: న్యూ ఇయర్ స్పెషల్.. పస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన లెనిన్ టీమ్ ..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×