E-Paper
Advertisement

Top 20 News: కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్, ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావులపై తీవ్ర విమర్శలు

Top 20 News: కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్, ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావులపై తీవ్ర విమర్శలు

1. మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ కలకలం

మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ కలకలం రేపింది. సుచిత్రలో కొకైన్ తీసుకుంటున్న ఏడుగురు యువకులను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగున్నర గ్రాముల కొకెయిన్, ఒక యాక్టీవా స్కూటీ, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు.

2. అవినీతికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ

ప్రభుత్వ అధికారుల్లో అవినీతి నిర్మూలన కోసం జ్వాలా స్వచ్ఛంద సంస్థ వినూత్న ప్రయత్నం చేస్తోంది. హన్మకొండ కలెక్టరేట్‌లో అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వాధికారుల సంతకాల సేకరణ నిర్వహించింది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తొలి సంతకం చేశారు. అవినీతిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

3. కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం.. ఫుల్ రష్

నూతన సంవత్సరం వేళ కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే కిలోమీటరు మేర క్యూలైన్లలో వేచి ఉండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

4. కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్

బీఆర్‌ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నూతన సంవత్సరం తొలి రోజే కేటీఆర్.. గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

5. భక్తుల రద్ధీ

నూతన సంవత్సరం సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 80 వేల మందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 22 ఎకరాల్లో పార్కింగ్, అదనపు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. మహాప్రదక్షిణలు రద్దు చేసి, కేవలం మహాద్వార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు.

6. పోటీలకు సిద్ధం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారం గ్రామం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు వేదికగా నిలవనుంది. జనవరి 7 నుంచి 11 వరకు జరిగే 69వ అండర్-17 జాతీయ కబడ్డీ టోర్నమెంట్‌ జరగనుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రతిష్ఠాత్మక పోటీలకు దేశవ్యాప్తంగా దాదాపు 30 రాష్ట్రాల నుంచి యువ కబడ్డీ క్రీడాకారులు పాల్గొననున్నారు.

7. ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావులపై తీవ్ర విమర్శలు

ధర్మాన కృష్ణదాస్, ప్రసాదరావులపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ కీలక ఆరోపణలు చేశారు. కృష్ణదాస్, ప్రసాద్‌లపై ఫిర్యాదు చేసిన తర్వాత రోజు నుంచి.. కింజరపు అప్పన్న కనిపించడం లేదన్నారు. తనపై దాడికి ప్లాన్ చేశారనే అప్పన్నే తనకు చెప్పారన్నారు దువ్వాడ శ్రీనివాస్.

8. ఆలయం కిటకిట

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ఇస్కాన్ దేవాలయం నూతన సంవత్సరం వేళ భక్తులతో కిటకిటలాడింది. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రికి 20 వేల మంది వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

9. న్యూఇయర్ విషెస్

నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆకాంక్షించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు.. ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ సూచనల మేరకు పుస్తకాలు అందజేసి విషెస్ చెప్పారు.

10. ధనుర్మాస ఉత్సవాలు

మంచిర్యాల జిల్లా అక్కపెల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి.. భక్తులకు హితబోధ చేస్తూ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. కొత్త ఏడాదిలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

11. పోటెత్తిన భక్తులు

నూతన సంవత్సరం సందర్భంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో పాలు, బిస్కెట్లు, ప్రసాదం పంపిణీ చేశారు.

12. ప్రత్యేక పూజలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ సందర్శించారు. ఆలయ ఆవరణలోని కపాలేశ్వర స్వామి ఘట్టం వద్ద పునః ప్రతిష్టించిన శివలింగాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.

13. కలెక్టర్ విషెస్

పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ప్రజలకు, అధికారులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సహా పలువురు అధికారులు ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. ఈ ఏడాది అందరి కుటుంబాల్లో సంతోషం, ఆరోగ్యం వెల్లివిరియాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

14. శ్రీవారి సేవలో ప్రముఖులు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారికి ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

15. మందుబాబులకు కౌన్సిలింగ్

హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించారు. గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వద్ద 500 మందికిపైగా యువతకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అవగాహన కల్పించారు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారు.

16. ప్రత్యేక ప్రార్థనలు

రంగారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ జహంగీర్ పీర్ దర్గాను నూతన సంవత్సరం సందర్భంగా సినీ నటుడు అలీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాబాకు ప్రత్యేకంగా దటీలు, పూలచాదర్‌ను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలీని చూసేందుకు స్థానికులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

17. త్వరలోనే అందుబాటులోకి..

సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. తొలి రైలు కోల్‌కతా- గువాహటిల మధ్య అందుబాటులోకి రానుందని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు.

18. న్యూయార్క్ మేయర్‌గా..

న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్‌ మమ్దానీ ప్రమాణస్వీకారం చేశారు. మాన్‌హట్టాన్‌లోని ఓ చారిత్రక సబ్‌వే స్టేషన్‌లో ఈ కార్యక్రమం జరగడం గమనార్హం. ఖురాన్‌పై ప్రమాణం చేసి.. న్యూయార్క్‌లో తొలి ముస్లిం మేయర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

19. కిక్కిచే 2026

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే IPL ఈసారి వేసవిలో అలరించనుంది. మార్చి 26 నుంచి మే 30వరకు జరిగగే ఈ మెగా టోర్నీలో 10 ఫ్రాంచైజీలు మొత్తం 84 మ్యాచ్‌లు ఆడనున్నాయి. గత సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. భారీ వేలం తర్వాత జట్లన్నీ సరికొత్తగా మారడంతో ఈ సారి పోరు మరింత ఉత్కంఠభరితంగా సాగనుంది.

20. దీపావళికి ఫస్ట్ పార్ట్

భారతీయ ఇతిహాసం రామాయణాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌లో రూపొందుతున్న చిత్రం ‘రామాయణ’. బాలీవుడు దర్శకుడు నితేశ్ తివారీ దీనిని తెరకెక్కిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా ప్రేక్షకులకు విషేస్ చెబుతూ.. మూవీ ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది దీపావళి పండుగకు, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×