E-Paper
Advertisement

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్.. అతిథులు వీళ్లే!

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్.. అతిథులు వీళ్లే!
Advertisement

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అనుకున్న సమయాన్ని కంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో విడుదల కాబోతున్న సినిమాని మార్చి 26 తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అయితే ఉగాది పండుగ సందర్భంగా విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడటంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఈ సినిమా విడుదలకు కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేశారు. ఇకపోతే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చాలా ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక ఎప్పుడు ఎక్కడ ఏంటి అనే వివరాలపై కూడా స్పష్టత వచ్చింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మార్చి 15వ తేదీ యూసఫ్ గూడ గ్రౌండ్ లో నిర్వహించబోతున్నారు.

ప్రీ రిలీజ్ గెస్టులుగా మెగా హీరోలు..

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. అలాగే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ముఖ్య అతిథులుగా మెగా హీరోలు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా మెగా హీరోలా సమక్షంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎక్కడ ఏ ఇంటర్వ్యూలోను పాల్గొనలేదు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ స్పీచ్ పట్ల ఎంతో ఆసక్తి నెలకొంది.

అంచనాలు పెంచేసిన అప్డేట్..

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ ఇటీవల సుజీత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఉగాది పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తూ ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా మరొక హీరోయిన్ రాశిఖన్నా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు ఇతర అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి.

Also Read: Monalisa Bhosle: ప్రియుడుతో పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా.. ఏం జరిగిందంటే?

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×