SSMB 29 Song : ఎస్ఎస్ఎంబి 29 (SSMB 29)..మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి (Rajamouli) కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ లెవెల్ మూవీ ఇది. ప్రియాంక చోప్రా (Priyanka Chopra)హీరోయిన్ గా.. పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) విలన్ గా చేస్తున్న ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో ఇప్పటికే ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రివీల్ చేశారు. ఇందులో కుంభ పాత్రలో నటిస్తున్నట్టు రివీల్ చేశారు. ఇకపోతే మరోవైపు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు అనే కారణంతో రాజమౌళి నవంబర్ 15న గ్లోబ్ ట్రోటర్ పేరుతో ఒక పెద్ద ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లో టైటిల్ గ్లింప్స్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఈవెంట్ కి సంబంధించి భారీ ఎత్తున సన్నాహాలు పూర్తవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్ ఎస్ ఎం బి 29 నుండి ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు.ఈ ప్రమోషనల్ సాంగ్ కి కీరవాణి మ్యూజిక్ అందించగా.. శృతిహాసన్ తన అద్భుతమైన గొంతుతో ప్రతి ఒక్క పదాన్ని చాలా బిగ్గరగా పాడి పాటకి మరింత ప్రాణం పోసింది. చాలా రోజుల నుండి ఎస్ఎస్ఎంబి 29 నుండి అప్డేట్ల కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు పృథ్వీ పోస్టర్… ఈ ప్రమోషనల్ సాంగ్ రెండు కూడా కొత్త జోష్ ని నింపాయి. అయితే తాజాగా విడుదలైన ప్రమోషనల్ సాంగ్ పూర్తిగా వారణాసి బ్యాక్ డ్రాప్ లో మొదలై ప్రపంచాన్ని చుట్టేసే విధంగా ఉంది. ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్క పదం శివ తత్వాన్ని సూచించేలా కనిపిస్తోంది.
సంచారీ అంటూ రిలీజ్ చేసిన ప్రోమోలో ప్రతి ఒక్క పదంలో శివతత్వం , రుద్రత్వం కనిపిస్తోంది. ఈ పాటలో ఉన్న పల్లవి విషయానికి వస్తే..కాలాన్ని ఆదేశిస్తూ ప్రతిరోజు పరుగులే.. వేగాన్ని శ్వాసిస్తూ పెనుగాలై తిరిగేలే.. ఖండాలే దాటేస్తూ కగరాజై వాలే..రా..రా.. రా రా ధీర ధ్రువ తార.. అంటూ శృతిహాసన్ తన వాయిస్ తో పాటకి ప్రాణం పోసింది.అయితే ఈ పల్లవిలో ఉన్న ప్రతి ఒక్క పదంలో వేగం, సాహసం, ధైర్యం, సంహారం వీటన్నింటిని సూచిస్తున్నాయి.
శివ తత్వాన్ని వివరించేలా రాసిన ఈ పాటకి అర్థం ఏమిటంటే..శివుడు మహాకాళుడు.. ఆయన కాలాన్ని సృష్టించి.. పాలించి.. సంహరించే దేవుడు. అంతేకాదు నిత్య నటరాజులా ఎప్పుడు చలనంలోనే ఉంటాడని ఈ పాటలోని పల్లవి అర్థం. అంతే కాకుండా పెనుగాలి లాంటి రుద్రుడు. వేగవంతమైన సంహారశక్తి కలవాడు అని దీని అర్థం.
శ్వాస అంటే కూడా శివుడు అనే అర్థం. ఎందుకంటే ఆ శివుడే ప్రాణదాత. శివుడు విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నాడు.ఆ మహా శివుడు పంచభూతాలను తనలో లయం చేసుకొనే లయకారుడు. అలాంటి సంచారుడు.. గరుత్మంతుడు లాంటి వేగం కలిగిన శివుడి వాహనం అయినటువంటి నంది శక్తిని కలగలుపుకొని శివుడు అసుర సంహారం చేసే యోధుడు. అంతేకాదు ఆ మహాశివుడు ఎప్పటికీ దృవతారలా నిలిచిపోయే స్థిరమైన వాడు. కైలాసం నుంచి సమస్త లోకాలకు సంచారి శివుడే అంటూ ఈ పల్లవిలో అర్థం దాగి ఉంది.
ఇక ఈ పాటలోని చరణం విషయానికి వస్తే..
సంచారి..సంచారి.. నినదించె రణభేరి..
సంహారి..సంహారి.. మృత్యువుపై తన స్వారి..
సంచారి.. సంచారి..సాహసమే తన దారి..
సహారి..సంహారి..అసురుల పై అసిధారి..
ఈ చరణం లోని అర్ధాన్ని గమనిస్తే.. నినదించే రణభేరి అంటే అది శివుడి ఢమరుకాన్ని సూచిస్తుంది. రణభేరి లాంటి శబ్దం సృష్టి సంహార నాదం అని అర్థం. సంహారకుడు అంటే మరణం మీద సవారి చేసేవాడని అర్థం. ఈ మరణం మీద సవారి చేసేవాడు ఎవరు శివుడే కదా. మృత్యువుపై సవారి చేసే స్మశానవాసి.. చావు భయంలేని పరమేశ్వరుడు..వీరభద్రుడు అంటే అసుర సంహారంలో ధైర్య స్వరూపుడు..శివుడు త్రిపురాంతకుడు అంటే త్రిపురాసురులను ఖడ్గంతో సంహరించేవాడని అర్థం.. సంచారి అంటే శివుడు నిరంతరం తాండవం చేస్తూ ఉంటాడు.
సంహారి అంటే శివుడు కాలభైరవ స్వరూపం అని అర్థం.మృత్యువుపై స్వారీ అంటే మృత్యుంజయుడు అలాగే మృత్యువును శాసించేవాడు ఆ మహా శివుడే.కాలాన్ని శాసించేవాడు అంటే కాల చక్రాన్ని నడిపేవాడు ఆ మహాశివుడు అని అర్థం.ఇలా ఎస్ఎస్ఎంబి 29 నుండి వచ్చిన ఈ పాట మొత్తం శివతత్వాన్ని సూచించేలా ఉంది.
also read:2026 Mega Movie’s: వచ్చే ఏడాది మెగా మేనియా షురూ.. ఎవరి సామర్థ్యం ఎంత?