BigTV English
Advertisement

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Peddi:ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని చరణ్ ఫ్యాన్స్ పాడుకుంటున్నారు. మరి పెద్ది నుంచి అప్డేట్ వస్తే ఆ మాత్రం ఉత్సాహం ఉండకపోతే వారు ఫ్యాన్స్ ఎలా అవుతారు. గేమ్ ఛేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న చిత్రం పెద్ది. ఉప్పెన సినిమాతో నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నాడు.  ఈ చిత్రంలో చరణ్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా..శివరాజ్‌కుమార్,జగపతి బాబు,దివ్యేందుశర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ షాట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.


వచ్చే ఏడాది మార్చి 27 న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఏ సినిమాకు అయినా ప్రమోషన్స్ అనేవి చాలా ముఖ్యం. సినిమా రిలీజ్ కు ముందు పదిరోజులు చేస్తే చాలదు. సినిమా రిలీజ్ అయ్యేసరికి అందులోని సాంగ్స్, డైలాగ్స్ ప్రేక్షకుల నోళ్ళలో నానాలి. అలా నానాలంటే.. ప్రమోషన్స్ ఇప్పటినుంచే మొదలుపెట్టాలి. బుచ్చి కూడా అదే ప్లాన్ చేసాడు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కేవలం ఫస్ట్ గ్లింప్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు రెహమాన్.

ఇక ఇప్పుడు పెద్ది నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. చికిరి అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్లు వారం రోజుల నుంచి హైప్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా సికిరి సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. చికిరి అనే పదమే కొత్తగా ఉంది. అసలు ఆ పదానికి అర్ధం ఏంటి అనేవారికి ఈ వీడియోలో దాని అర్ధం కూడా చెప్పుకొచ్చారు. చికిరి అంటే అందమైన అమ్మాయి అని అర్ధమని బుచ్చి చెప్పుకొచ్చాడు.


అరుదైన పదాలను ఉపయోగించి  అద్భుతమైన సాంగ్స్ అందించే రెహమాన్ చికిరి పదం వింటే ఊరుకుంటాడా.. అదే లైన్ తో ఒక మంచి సాంగ్ నే తీసుకొచ్చాడు. అదే చికిరి.. చికిరి సాంగ్. ఈ సాంగ్ ప్రోమో అదిరిపోయింది. చరణ్ లుక్ .. వెనుక విలేజ్ బ్యాక్ డ్రాప్.. రంగస్థలం వైబ్ వచ్చింది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక చివర్లో చరణ్ హుక్ స్టెప్ అయితే.. వచ్చే ఏడాది వరకు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా ఉంది.

అయితే ఇక్కడే ఒక చిన్న సమస్య.. సోషల్ మీడియా వచ్చాకా దేన్నీ దాచలేకపోతున్నామని చెప్పొచ్చు. పోస్టర్స్ దగ్గర నుంచి మ్యూజిక్, డ్యాన్స్ స్టెప్స్.. ఇలా ప్రతీది వేరే ఎక్కడైనా వాడారా.. ? లేక వీళ్ళే కాపీ కొట్టారా ..? అని ఆరాలు తీస్తున్నారు. చికిరి సాంగ్ ప్రోమోలో చరణ్ వేసిన హుక్ స్టెప్ కూడా కాపీనే అని తేలింది. విచిత్రం ఏంటంటే..  ఆ కాపీ సాంగ్ కూడా చరణ్ దే.. కొరియోగ్రాఫర్ కూడా జానీ మాస్టర్ నే. నాయక్ సినిమాలోని లైలా ఓ లైలా సాంగ్ లో కింద కూర్చొని నడుమును ఊపే స్టెప్ నే కొద్దిగా మార్చి చికిరి సాంగ్ లో పెట్టించేశాడు జానీ. స్టెప్ బావున్నా కూడా కాపీ అనేసరికి కొద్దిగా విమర్శలు వస్తున్నాయి. మరి ఫుల్ సాంగ్ లో ఇంకెన్ని స్టెప్స్ జానీ కాపీ కొట్టాడో చూడాలంటే నవంబర్ 7 వరకు ఆగాల్సిందే.

Related News

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Chikiri Song Promo : మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Big Stories

×