Gold Rate Dropped: వావ్.. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. రోజు ఇలాగే తగ్గుతూ పోతే పసిడి ప్రియులకు చెప్పలేని ఆనందం.. మొన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు మళ్లీ ఇప్పుడు తగ్గుతున్నాయి. రాబోయే రోజుల్లో బంగారం ధర లక్ష వరకు అయ్యే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదైతేనేం బంగారం ధరలు తగ్గడంతో పసిడి ప్రియులు చాలా సంతోషిస్తున్నారు.
నేటి బంగారం ధరలు ఇలా..
మంగళవారం స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. బుధవారం భారీగా తగ్గాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460 కాగా.. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,480 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,12,250 ఉండగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,350 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.980 తగ్గింది..
తగ్గుతున్న బంగారం ధరలు.. ఆనందంలో బంగారు ప్రియులు
బంగారం ధరలు తగ్గడం వల్ల పసిడి ప్రియులు కాస్త మళ్లీ బంగారంపై మగ్గు చూపుతున్నారు. కానీ, పెట్టుబడి దారులకు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ధరలు భారీగా పెరిగాయని చాలా మంది పెట్టుబడిగా పెట్టుకున్నారు. కానీ, ఇప్పుడు మళ్లీ తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు. ఎవరైన బంగారం కొనాలి అనుకుంటే తగ్గినప్పుడే ఇప్పుడే కొనండి లేదంటే.. మళ్లీ పెరిగితే ఇంకా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమౌతుందో అలా ఉంటది పరిస్థితి.. అయితే నేడు రాష్ట్రంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,21,480 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,350 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,480 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,350 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,480 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,350 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,630 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,11,500 వద్ద ఉంది.
Also Read: ఘోర ప్రమాదం.. అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. స్పాట్‌లో ముగ్గురు..
నేటి సిల్వర్ ధరలు ఇలా..
బుదవారం బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,65,000 కాగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,63,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.2,000 తగ్గింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,50,000 వద్ద కొనసాగుతోంది. ఎవరైనా సిల్వర్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి లేదంటే ఇంత మంచి ఛాన్స్ మళ్లీ రాదు..