E-Paper
Advertisement

ఇంకా తగ్గని ‘పెద్ది’ గ్లింప్స్ జోరు.. దేశ వ్యాప్తంగా నెం.1లో ట్రెండింగ్‌!

ఇంకా తగ్గని ‘పెద్ది’ గ్లింప్స్ జోరు.. దేశ వ్యాప్తంగా నెం.1లో ట్రెండింగ్‌!
Advertisement

Peddi Glimpse: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ‘పెద్ది’ (Peddi Movie) కోసం చేసిన ఫియర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న విషయం తెలిసిందే. చరణ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం విడుదలైన ఈ స్పెషల్ గ్లింప్స్‌తో పాటు వచ్చిన పోస్టర్లు ఆయనను పూర్తిగా కొత్త అవతార్‌లో ప్రజంట్ చేశాయి. పహిల్వాన్ లుక్‌లో ఆయన కనిపించిన తీరు ప్రేక్షకులని సర్‌ప్రైజ్ చేసింది. అసలు గ్లింప్స్ అంటున్నారు.. ఎలా ఉంటుందా? అందులోనూ బర్త్‌డేకి వదులుతున్నారు.. అంటూ ఫ్యాన్స్ ఎంతగా కంగారు పడిపోయారో.. సోషల్ మీడియా చూస్తే అర్థమవుతోంది. కానీ, బుచ్చిబాబు సానాపై ఉన్న నమ్మకంతో.. మరోవైపు ధైర్యంగానే కనిపించారు. ఈ క్రమంలో ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్ (Peddi Glimpse) విడుదలైన వెంటనే ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకోవడం, దేశవ్యాప్తంగా నెం.1లో ట్రెండింగ్‌లో దూసుకుపోతుండటంతో అభిమానులు ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి.

Also Read- 23 ఏళ్ల అబ్బాయి డైరెక్ట్ చేసి హిట్ కొట్టాడంటే నమ్మలేకపోయా! – శర్వానంద్

దర్శకుడు శంకర్‌పై భారీగా ట్రోలింగ్

Advertisement

ఈ గ్లింప్స్ విడుదలైన ఒక రోజు తర్వాత కూడా దేశ వ్యాప్తంగా నెంబర్ వన్ 1లో ట్రెండింగ్ అవుతుండటంతో.. సినిమాపై మరింతగా అభిమానులకు, యూనిట్‌కు నమ్మకం పెరుగుతోంది. ఈ గ్లింప్స్‌లోని చరణ్ మేకోవర్ గురించి ప్రశంసించిన వారే కానీ, ఒక్కరు కూడా నెగిటివ్‌గా మాట్లాడటం లేదు. అంతగా చరణ్ ప్రాణం పెట్టేశారు. మరీ ముఖ్యంగా, ఒక్క సినిమా అనుభవంతో బుచ్చిబాబు ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తుండటం, ఇలాంటి అవుట్‌పుట్ తీసుకొస్తుండటంతో, ఇంతకు ముందు చరణ్ చేసిన దర్శకుడు శంకర్‌పై భారీగా ట్రోలింగ్ నడుస్తుండటం విశేషం. చరణ్ బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ పూర్తిగా రా అండ్ ఫెరోషియస్‌గా కనిపిస్తూ.. నిజమైన ఫైటర్‌లా కనిపించే బలమైన భుజాలు, చేతులు, భారీ ఛాతీ, కండలు తిరిగిన దేహంతో అసలైన పహేల్వాన్‌గా కనిపించడంతో.. ఇలాంటి బాడీని వాడుకోలేకపోయావ్ కదయ్యా.. అంటూ శంకర్ ప్రస్తావన్ తెస్తున్నారు.

Also Read- తిరుమల కేక్ వివాదంపై మాధురి క్లారిటీ.. నేనెవరికీ క్షమాపణ చెప్పలేదు.. చెప్పనంటూ..

అంచనాలు అమాంతం పెంచేసిన గ్లింప్స్

Advertisement

ఇక ఈ గ్లింప్స్‌లో రెజ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే విజువల్స్.. చరణ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించాయి. ముందుకు దూసుకెళ్లే సీన్స్‌లో, గదను పట్టుకుని కూర్చునే షాట్స్‌లో, హనుమాన్ ప్రేరణతో వచ్చిన యోధుడిలా ఆయన ఆగ్రహం, ఆత్మవిశ్వాసం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెడపై దుమ్ము ఎగిరే ఫ్రేమ్స్, నరాలు బిగుసుకునే ఎఫర్ట్, కళ్లలో కనిపించే ఫైర్ అన్నీ కలిపి ఒక థండరస్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాయంటే అతిశయోక్తి కానే కాదు. ఇది కేవలం ఒక మేకోవర్ అని మాత్రమే అనలేం.. బలం, క్రమశిక్షణ, మైథిక్ పవర్ కి ప్రతీకలా నిలిచే పాత్ర అని అంటే బాగుంటుంది. ఈ గ్లింప్స్‌తో పెద్ది సినిమా స్కేల్, మాస్ ఇంపాక్ట్, హై వోల్టేజ్ ఎలివేషన్ ఎంత భారీగా ఉండబోతుందో చాలా గొప్పగా రివీల్ చేశారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సమర్పిస్తున్నాయి.

Also Read- దువ్వాడలో ఆ క్వాలిటీ చూసి పడిపోయానన్న మాధురి .. తన కాలి గోటికి సరిపోరంటూ!

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×