ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 29వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉద్యోగమున అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలలో స్థిరమైన లాభాలు అందుకుంటారు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.
ఆర్థికంగా వాతావరణం అంతంత మాత్రంగానే ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగమున ఇతరుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరప్రాంత బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.
సోదరులతో ఆస్థి వివాదాలు కలుగుతాయి. బంధు మిత్రులతో ఏర్పడిన వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. కీలక వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వాహన ప్రయాణాలలో నిర్లక్ష్యం పనికిరాదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.
ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమైన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో గృహమున సందడిగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక ఋణ సమస్యల నుండి కొంతవరకు బయటపడతారు.
ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది.
కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉండదు. నిరుద్యోగులకు అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
భూ సంబంధిత వివాదాలలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులను అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.
ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఇంటా బయట అనుకూలత వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.