E-Paper
Advertisement

‘పెద్ది’ సెన్సార్ పూర్తి .. 3 గంటల సినిమాలో డిలేట్ చేసిన సీన్లు ఇవే.. పాటలో కూడా..

‘పెద్ది’ సెన్సార్ పూర్తి .. 3 గంటల సినిమాలో డిలేట్ చేసిన సీన్లు ఇవే.. పాటలో కూడా..
Advertisement

Peddi Censor: టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్న కొత్త చిత్రం ‘పెద్ది’ (PEDDI) తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. కిలారు వెంకట సతీష్ నిర్మాణంలో, వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి కేంద్ర ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డ్ (CBFC) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. సినిమా కంటెంట్, రన్‌టైమ్, బోర్డు సూచించిన మార్పులు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read also-చిత్రపురి హౌసింగ్ సొసైటీలో భారీ కుంభకోణం.. నిబంధనలకు విరుద్ధంగా రో-హౌస్ రిజిస్ట్రేషన్..

‘UA 16+’ సర్టిఫికేట్..

Advertisement

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘UA 16+’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. అంటే 16 ఏళ్లలోపు పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో సినిమా చూడాలని సూచించింది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన హైలైట్ దాని భారీ రన్‌టైమ్. సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం ‘పెద్ది’ సినిమా మొత్తం నిడివి 189 నిమిషాలు. అంటే దాదాపు 3 గంటల 9 నిమిషాల పాటు ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద రన్‌టైమ్‌తో విడుదలవుతున్న సినిమాలు అరుదుగా కనిపిస్తున్న నేపథ్యంలో ‘పెద్ది’పై మరింత ఆసక్తి పెరిగింది.

సెన్సార్ బోర్డు మార్పులు

సినిమాలో కొన్ని డైలాగ్స్, విజువల్స్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో చిత్ర బృందం కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది.

డైలాగ్స్‌కు మ్యూట్

Advertisement

సినిమాలో ఉపయోగించిన “Loudesh”, “Bokka”, “Lambdi kodaka”, “Madarchod”, “Dongamunda kodaka”, “Kalchi padi denguta” వంటి పదాలను మ్యూట్ చేయాలని బోర్డు సూచించింది. వాటికి సంబంధించిన ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌ను కూడా తొలగించారు.

పాటలో పదం మార్పు

‘చికిరి’ పాటలో ఉపయోగించిన “సరుకు సామాన్” అనే పదాన్ని మార్చాలని సూచించడంతో ఆ లిరిక్స్‌లో సవరణలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా సెకండాఫ్‌లో వచ్చే “రాజస్థాన్” అనే పదంతో పాటు, ఒక నిర్దిష్ట కమ్యూనిటీకి సంబంధించిన ప్రస్తావనలను పూర్తిగా తొలగించారు. ఈ మార్పులు సబ్‌టైటిల్స్‌లో కూడా అమలు చేశారు.

విజువల్ కట్

48.36 నిమిషాల సమయంలో కనిపించే ‘మిడిల్ ఫింగర్’ విజువల్‌ను నేరుగా చూపించకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ (CG) సహాయంతో కవర్ చేసినట్లు సమాచారం.

Read also-‘కింగ్’ నాగార్జున సినీ ప్రస్థానానికి నలభై ఏళ్లు.. తండ్రి బాటలో హృదయాలను గెలుచుకుంటూ..

రిలీజ్‌కు సిద్ధమైన ‘పెద్ది’

సెన్సార్ బోర్డు సూచించిన అన్ని మార్పులను పూర్తి చేసిన తర్వాత కూడా సినిమా రన్‌టైమ్‌లో ఎలాంటి కోతలు లేకుండా 189 నిమిషాల నిడివితోనే థియేటర్లలో విడుదలకు అనుమతి లభించింది. సినిమా నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ, కథ మరియు కంటెంట్‌పై పూర్తి నమ్మకంతోనే మేకర్స్ ఈ రన్‌టైమ్‌తో ముందుకు వెళ్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రేక్షకుల్లో ఒకటే ప్రశ్న వినిపిస్తోంది ‘పెద్ది’ ఈ భారీ నిడివితో ఎలాంటి అనుభూతిని అందించబోతోంది?

Related News

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

Big Stories

Advertisement
×