Mohammad Amir: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మరో 8 రోజుల్లో ఈ టోర్నమెంట్ ఫినిష్ కానుండగా… నాకౌట్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే మూడు జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకోగా… నాలుగో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అలాగే కేకేఆర్ పోటీ పడుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ లో తాను ఆడబోనని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ (Mohammad Amir) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రూ.100 కోట్లు ఇచ్చినా కూడా ఐపీఎల్ లో ఆడబోనని.. అల్లా మీద ఒట్టేసి చెబుతున్నానని వ్యాఖ్యానించారు. దీంతో మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పాకిస్తాన్ దేశంలో పుట్టి పెరిగిన మహమ్మద్ అమీర్… తాజాగా బ్రిటిష్ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. అతని సతీమణి నర్డిస్ ఖాన్ ఇంగ్లాండ్ కు చెందిన పౌరురాలు. ఆమెను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో యూకే నివాస నిబంధనల ప్రకారం లీగల్ ప్రాసెస్ పూర్తి చేసి లేటెస్ట్ గా పౌరసత్వాన్ని కూడా దక్కించుకున్నాడు మహమ్మద్ అమీర్. నాలుగు రోజుల కిందట అధికారికంగా బ్రిటిష్ ప్రభుత్వం అతనికి పౌరసత్వం కల్పిస్తూ ప్రకటన చేసింది. అతనికి వీసా కూడా అప్పగించింది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పౌరసత్వం దక్కించుకున్న మహమ్మద్ అమీర్…. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 మెగా వేలంలో పాల్గొంటారని చర్చ మొదలైంది. పాకిస్తాన్ తో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో అతడు కచ్చితంగా వేలంలోకి వస్తాడని ఇండియన్ మాజీ క్రికెటర్లు కూడా అంచనా వేశారు. అయితే ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో మహమ్మద్ అమీర్ స్వయంగా స్పందించారు. తనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టి చెప్పారు.
రూ.100 కోట్లు ఇచ్చి కాళ్లు మొక్కినా కూడా.. ఐపీఎల్ ఆడబోనని తేల్చి చెప్పారు. తనకు ఐపిఎల్ అంటే అసహ్యం అంటూ ఫైర్ అయ్యారు. అలాంటి టోర్నమెంట్లో ఆడడం కంటే ఇంట్లో కూర్చోవడం బెటర్ అని వ్యాఖ్యానించారు. అలా అని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కూడా తాను ఆడబోనని వెల్లడించారు. వాళ్లు అవకాశం ఇస్తానన్నా కూడా రిజెక్ట్ చేస్తానని స్పష్టం చేశారు మహమ్మద్ అమీర్. దీంతో మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ వెధవకు ఇంగ్లాండు పౌరసత్వం రావడమే ఎక్కువ.. అందులోనూ ఐపిఎల్ లోకి రమ్మని వీడికి ఎవరు చెప్పారని మండిపడుతున్నారు. వేలంలోకి వస్తే కుక్క కూడా మహమ్మద్ అమీర్ ను పట్టించుకోదని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటులోనే మహమ్మద్ అమీర్ కు ఎవరు ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. బ్రిటిష్ పౌరసత్వం వస్తే, నువ్వేమైనా రియల్ హీరో అనుకుంటున్నావా ? అంటూ చురకలు అంటిస్తున్నారు.
🚨 MUHAMMAD AMIR REFUSED TO PLAY IN THE IPL 🚨
Muhammad Amir said, "I have no plans to play in the IPL, nor do I have any plans to represent the England Cricket Team anytime in the near future." pic.twitter.com/ehl6f14Doa
— Rayham. (@RayhamUnplugged) May 23, 2026