E-Paper
Advertisement

ఇక నో రీసేల్ టెన్షన్‌.. బై బ్యాక్ గ్యారెంటీతో లభిస్తున్న 8 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

ఇక నో రీసేల్ టెన్షన్‌.. బై బ్యాక్ గ్యారెంటీతో లభిస్తున్న 8 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

EVs With Guaranteed Resale Value: ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. EV కొంటే భవిష్యత్తులో దాన్ని అమ్మేటప్పుడు మంచి ధర వస్తుందా? లేదా? అని ఆలోచిస్తారు. బ్యాటరీ టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో పాత ఎలక్ట్రిక్ వాహనాల రీసేల్ విలువ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలోనే పలు ఆటో మేకర్స్ బై బ్యాక్ గ్యారెంటీ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ పథకాల ద్వారా వినియోగదారులు నిర్దిష్ట కాలం తర్వాత తమ వాహనాన్ని కంపెనీకి తిరిగి అమ్మే అవకాశం ఉంటుంది. దీంతో రీసేల్ వ్యాల్యూ విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంతకీ ఈ స్కీమ్ తో అందుబాటులో ఉన్న ఈవీలు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి ఇ-విటారా

మారుతి సుజుకి నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ SUV బై బ్యాక్ గ్యారెంటీతో అందుబాటులోకి వచ్చింది. మూడు సంవత్సరాల తర్వాత వాహనం విలువలో 60 శాతం వరకు, నాలుగు సంవత్సరాల తర్వాత 50 శాతం వరకు బై బ్యాక్ వ్యాల్యూ పొందే అవకాశం ఉంది. అదనంగా బ్యాటరీ వారంటీ, ఛార్జింగ్ సదుపాయాలు కూడా అందిస్తున్నారు.

⦿ విండ్సర్ EV

ఎంజీ మోటార్ అందిస్తున్న విండ్సర్ EV కూడా ఇదే స్కీమ్ తో అందుబాటులో ఉంది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న EVలలో ఈ ఈవీ ఒకటిగా కొనసాగుతోంది. కంపెనీ మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు  40 నుంచి 60 శాతం వరకు బై బ్యాక్ వ్యాల్యూను అందిస్తుంది.

⦿ MG కామెట్ EV

ఇది కూడా విండ్సర్ EV లాంటి బెనిఫిట్స్ తో వస్తోంది. సిటీ ప్రయాణాలకుల అనుకూలంగా ఉండే ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు కొనుగోలుదారులకు భవిష్యత్తులో రీసేల్ వ్యాల్యూ మీద భరోసా కల్పిస్తోంది.

⦿ MG ZS EV

ఇది కూడా బై బ్యాక్ ప్రోగ్రామ్‌ తో అందుబాటులో ఉంది. మూడు సంవత్సరాల తర్వాత 60 శాతం వరకు విలువను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ వ్యక్తిగత వినియోగదారులతో పాటు కొన్ని ఫ్లీట్ ఆపరేటర్లకు కూడా వర్తిస్తుంది.

⦿ VF 6, VF 7

ఇటీవల భారత మార్కెట్లోకి అడుగు పెట్టిన వియత్నాం కంపెనీ విన్‌ ఫాస్ట్ కూడా ఆకర్షణీయమైన బై బ్యాక్ పథకాలను ప్రకటించింది. VF 6, VF 7 మోడళ్లపై 75 శాతం వరకు బైబ్యాక్ వ్యాల్యూను అందిస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యధిక బై బ్యాక్ గ్యారెంటీలలో ఇదీ ఒకటిగా చెప్పుకోవచ్చు.

⦿ టియాగో.ఈవీ, పంచ్.ఈవీ

టాటా మోటార్స్ కూడా టియాగో.ఈవీ, పంచ్.ఈవీ మోడళ్లపై బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS) పథకం ద్వారా బైబ్యాక్ బెనిఫిట్స్ అందిస్తోంది. మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు 40 నుంచి 60 శాతం వరకు బై బ్యాక్ విలువ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా పంచ్.ఈవీకి జీవితకాల బ్యాటరీ వారంటీ కూడా అందిస్తున్నారు.

Read Also: E85 ఫ్యూయల్ వచ్చేసింది.. పెట్రోల్ కంటే చీప్.. కానీ ఓ ట్విస్ట్ ఉందండోయ్!

Related News

కొత్త టాటా టియాగో కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

యమహా NMax 155 వచ్చేస్తోంది.. ఫీచర్లు ఏంటి? ధర ఎంత ఉండొచ్చంటే?

E85 ఫ్యూయల్ వచ్చేసింది.. పెట్రోల్ కంటే చీప్.. కానీ ఓ ట్విస్ట్ ఉందండోయ్!

రైల్లో మీ లగేజీ మర్చిపోయారా? సింపుల్ గా ఇలా చేస్తే తిరిగి పొందవచ్చు!

EVలకు మారిన బాలీవుడ్ స్టార్లు.. ఏ హీరో దగ్గర ఏ ఎలక్ట్రిక్ కారు ఉందో తెలుసా?

ఇండియన్ మార్కెట్‌పై హోండా ఫోకస్.. 2030 నాటికి 10 కొత్త మోడళ్లు ఎంట్రీ!

భారత్‌ లో MG మాస్టర్ ప్లాన్.. హైబ్రిడ్‌ తో పాటు 3 ఎలక్ట్రిక్ కార్లు విడుదల!

Big Stories

×