Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న ‘పెద్ది’ (Peddi Movie) సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అలాంటి మార్క్‌ను సెట్ చేసింది. ముక్యంగా ‘చికిరి చికిరి’, ‘రై రై రా రా’ పాటలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ ఒకవైపు, చరణ్ మాస్ స్టెప్పులు మరోవైపు వెరసి ఈ సినిమా ఆల్బమ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు అందరి కళ్లు ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ ఐటమ్ సాంగ్ పైనే ఉన్నాయి. ఈ పాట కోసం మేకర్స్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read- Hariteja: కేవలం పని మనిషి పాత్రలే ఎందుకు?.. హరితేజ సమాధానమిదే!
ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, అయేషా ఖాన్ వంటి స్టార్ బ్యూటీల పేర్లు వినిపించినప్పటికీ.. ప్రస్తుతం మాత్రం బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటాని పేరు గట్టిగా వినిపిస్తోంది. గతంలో ‘పుష్ప’ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం దిశా పేరు పరిశీలనకు వచ్చినా, రెమ్యూనరేషన్ ఇష్యూస్ వల్ల వర్కౌట్ కాలేదు. కానీ ‘పెద్ది’ టీమ్ మాత్రం ఈసారి ఎలాగైనా దిశాని రంగంలోకి దించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పూజా హెగ్డే ఇప్పటికే చరణ్‌తో ‘రంగస్థలం’లో జిగేల్ రాణిగా మెప్పించింది కాబట్టి, ఈసారి ఫ్రెష్ నెస్ కోసం దిశా పటాని వైపు మొగ్గు చూపుతున్నట్లు టాక్. దిశా పటాని తెలుగు ప్రేక్షకులకు కూడా కొత్తేం కాదు. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా కనుక హిట్టై ఉంటే.. ఇప్పుడు దిశా పటాని టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అయ్యేది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. సరే విషయంలోకి వస్తే..
Also Read- Peddi Song: ‘రై రై రా రా’.. చరణ్ హుక్ స్టెప్‌ను దించేసిన స్కూల్ పాప.. వీడియో వైరల్!
‘పెద్ది’ ఐటమ్ (Peddi Item Song) కోసం దిశా పటాని (Disha Patani) కన్ఫర్మ్ అయితే, చరణ్ గ్రేస్‌కు ఆమె గ్లామర్ తోడై థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. బుచ్చిబాబు సానా తన సినిమాల్లో మ్యూజిక్‌కు, విజువల్స్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి తెలియంది కాదు. ఈ సినిమా 30 ఏప్రిల్, 2026న విడుదల కాబోతున్న తరుణంలో, ఈ ఐటమ్ సాంగ్ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తే కానీ ఈ సస్పెన్స్‌కి తెరపడదు. చూద్దాం మరి, ఫైనల్‌గా చరణ్ పక్కన స్టెప్పులేసే లక్కీ భామ ఎవరవుతారో? బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ విషయం టీమ్ అంతా బిజీబిజీగా ఉంది.
Also Read- Trisha Krishnan: పెళ్లి చేసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తా.. త్రిష స్పందన వైరల్..