E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు నూతన వస్త్రాభరణాలు కొంటారు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు నూతన వస్త్రాభరణాలు కొంటారు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 11వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. 

వృషభం

Advertisement

ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. 

మిథునం

నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 

కర్కాటకం

Advertisement

మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

సింహం

వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. 

కన్య

ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

వృశ్చికం

ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు. 

ధనుస్సు

ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.  

మకరం

వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. 

కుంభం

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.

మీనం

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×