E-Paper
Advertisement

Peddi Movie:భారీగా పెద్ది థియేట్రికల్ బిజినెస్…వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలు ఇవే!

Peddi Movie:భారీగా పెద్ది థియేట్రికల్ బిజినెస్…వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలు ఇవే!
Advertisement

Peddi Movie: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందు రాబోతున్న చిత్రం పెద్ది(Peddi Movie). ఈ సినిమా మార్చి 27వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇలా ఈ సినిమా విడుదలకు పెద్దగా సమయం లేని నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంటుంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఒక తెలుగు రాష్ట్రాలలోనే ఈ సినిమాకు వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం.

రూ. 500 కోట్లకు పైగా పెద్ది ప్రీ రిలీజ్ బిజినెస్..

ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందని నిర్మాతలు అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఇలా ప్రపంచవ్యాప్తంగా కేవలం థియేటర్ బిజినెస్ ఈ స్థాయిలో ఉంటే సాటిలైట్ అలాగే ఓటీటీ, ఆడియో రైట్స్ అన్ని కలుపుకొని సుమారు 500 కోట్లకు పైగా బిజినెస్ జరుగుతోందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక ఏపీ తెలంగాణ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిందని తెలుస్తోంది.

అంచనాలు పెంచిన అప్డేట్స్..

Advertisement

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా ఏపీ నైజం థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే ఈ సినిమా హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడిందని తెలుస్తుంది. మరి నిర్మాతల అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందా లేదా అనేది తెలియనుంది . పెద్ది సినిమాని భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా కోసం సుమారు 300 నుంచి 350 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారని సమాచారం.ఈ సినిమాని వృద్ధిస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి.

త్వరలోనే సెకండ్ సింగిల్..

Advertisement

ఇక ఫస్ట్ సింగిల్ కూడా భారీగా అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం రామ్ చరణ్ ఈసారి బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రూ.130 కోట్లకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. విడుదలకు ముందే పెద్ది సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకోబోతోందనేది తెలియాల్సి ఉంది.

Also Read: Pawan Kalyan: పవన్ సినిమాలో యంగ్ హీరో క్యామియో..థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×