E-Paper
Advertisement

RITES Recruitment: బరాబర్ రూ.2లక్షల జీతం భయ్యా.. మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు..!

RITES Recruitment: బరాబర్ రూ.2లక్షల జీతం భయ్యా.. మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, అప్లై చేసుకోవచ్చు..!
Advertisement

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ‘రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్ సర్వీస్‌ లిమిటెడ్’ (RITES), నిరుద్యోగ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు తీపి కబురు అందించింది. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మౌలిక సదుపాయాల రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం.

ఉద్యోగ ఖాళీల వివరాలు.. 

Advertisement

మొత్తం 48 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇందులో ప్రధానంగా మూడు రకాల పోస్టులు ఉన్నాయి:

టీమ్‌ లీడర్‌: 09 పోస్టులు

Advertisement

ప్రాజెక్ట్ ఇంజినీర్‌: 08 పోస్టులు

జూనియర్‌ ఇంజినీర్‌ (JE): 31 పోస్టులు

విద్యార్హతలు, వయస్సు వివరాలు.. 

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో (సివిల్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌) బీటెక్ (B.Tech) పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతతో పాటు, అభ్యర్థులకు ఆయా రంగాల్లో నిర్ణీత పని అనుభవం (Work Experience) ఉండటం తప్పనిసరి. అనుభవజ్ఞులకు ప్రాధాన్యతనిస్తూ, గరిష్ఠ వయోపరిమితిని 55 ఏళ్లుగా నిర్ణయించారు. ఇది సీనియర్ ప్రొఫెషనల్స్‌కు కూడా మంచి అవకాశాన్ని కల్పిస్తోంది.

జీతం.. 

ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలను రైట్స్ ఆఫర్ చేస్తోంది. టీమ్ లీడర్, జూనియర్ ఇంజినీర్ పోస్టులకు నెలకు రూ.70,000 నుండి రూ.2,00,000 వరకు వేతనం ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.50,000 నుండి రూ.1,60,000 వరకు వేతనం లభిస్తుంది.

ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు వివరాలు.. 

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగానే జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే 2026, జనవరి 22న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 2026, ఫిబ్రవరి 26.

దరఖాస్తుకు ప్రారంభ తేది: జనవరి 22

దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 26

అర్హత కలిగిన అభ్యర్థులు గడువు ముగిసేలోపు తమ దరఖాస్తులను సమర్పించి, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థలో భాగస్వాములు కావాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్న అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.rites.com

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×