Mrunal Thakur:ఒకప్పుడు హిందీ సీరియల్ ద్వారా తన నటన జీవితాన్ని మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ (Mrunal thakur) తొలిసారి మరాఠీ సినిమా ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాలు చేసిన ఈమెను ఏరికోరి మరీ ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) ‘సీతారామం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు. మొదటి సినిమాతోనే అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ముఖ్యంగా సీత క్యారెక్టర్ లో మృణాల్ అభినయం విపరీతంగా ఆమెకు అభిమానులను తెచ్చిపెట్టింది.
అలా తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా నిలిచిపోయింది. ఒక్క సినిమాతో విపరీతమైన యూత్ ను ఫ్యాన్ ఫాలోయింగ్ గా అందుకున్న ఈమె.. ఆ తర్వాత నాని (Nani) హీరోగా వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అడివి శేష్ (Adivi shesh) హీరోగా వస్తున్న ‘డెకాయిట్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి మృణాల్ ఠాకూర్ కి ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోయినా.. అటు వ్యక్తిగతంగా వార్తల్లో నిలుస్తూ ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లో నిలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.
అసలు విషయంలోకి వెళ్తే.. గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) తో రిలేషన్ లో ఉందని.. ఫిబ్రవరి 14వ తేదీన వివాహం కూడా చేసుకోబోతోంది అంటూ వార్తలు దావాణంలా పాకి పోతున్న విషయం తెలిసిందే. ఇక రోజుకో వార్త సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవడంతో ఇవన్నీ మృణాల్ వరకు చేరగా.. ఆమె వాటిని ఖండించింది. ధనుష్ తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది Siddhanth Chaturvedi) తో ఆమె చనువుగా ఉన్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయడంతో ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా? అనే కామెంట్లు కూడా వ్యక్తమయ్యాయి.
అంతేకాదు ఈమె ధనుష్ తో లవ్ లో లేనని క్లారిటీ ఇచ్చేసింది.. మరి సిద్ధాంత్ తో ప్రేమలో పడిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. దీనికి తోడు ఆ రూమర్స్ ను నిజం చేస్తూ సిద్ధాంత్ మృణాల్ పై కురిపించిన ప్రేమకు అభిమానులు ఫిదా అవుతూనే రూమర్స్ ను ఈ జంట నిజం చేసింది అనే కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ మేరకు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వీడియో విషయానికి వస్తే.. బాలీవుడ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది ఆమెకు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. గొడుగులో గులాబీ రేకులను నింపుకొని వచ్చి ఆమెపై పువ్వుల వర్షం కురిపించారు.
ALSO READ:Dheeraj Mogilineni: నైజాం డిస్ట్రిబ్యూషన్ పై ధీరజ్ ఊహించని కామెంట్స్.. పేరు మాత్రమే నాది!
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే వాలెంటైన్స్ డే వీక్ స్పెషల్ గా అలా చేయడంతో అటు మృణాల్ కూడా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై సిద్ధాంత్ ను హగ్ చేసుకోవడం ఆ వీడియోలో మనం చూడవచ్చు. ఇకపోతే ఈ జంట నిజంగానే లవ్ లో ఉన్నారని కొంతమంది కామెంట్ చేస్తుంటే.. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి సంజయ్ లీల భన్సాలీ సమర్పణలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ‘దో దీవానే సెహెర్ మేన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కాబోతోంది.