E-Paper
Advertisement

అసలు ‘పెద్ది’ రిలీజ్ ఈ నెలేనా?.. అయితే ప్రమోషన్లలో ఊపేది.. కారణం ఇదే..

అసలు ‘పెద్ది’ రిలీజ్ ఈ నెలేనా?.. అయితే ప్రమోషన్లలో ఊపేది.. కారణం ఇదే..
Advertisement

Peddi Movie: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ సినిమాపై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమా విడుదల తేదీకి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రకమైన సందిగ్ధత నెలకొంది.

Read also-Illu Illalu Pillalu Today Episode: ప్రేమ, ధీరజ్ ప్రేమకు రేవతి ఫిదా.. నర్మద మాస్టర్ ప్లాన్.. సాగర్ ను ఇరికించిన భాగ్యం..

మెగా ఫ్యాన్స్‌లో మొదలైన టెన్షన్!

Advertisement

రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాను ఏప్రిల్ 30, 2026న విడుదల చేస్తామని గతంలో చిత్ర బృందం ప్రకటించింది. కానీ, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా మూవీ టీమ్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రమోషన్లలో వేగం ఎక్కడ?

సాధారణంగా రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమా వస్తుందంటే కనీసం రెండు నెలల ముందే ప్రమోషన్ల హోరు మొదలవ్వాలి. కానీ ‘పెద్ది’ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటివరకు కేవలం రెండు పాటలను మాత్రమే విడుదల చేసి వదిలేశారు. ఆ పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచినప్పటికీ, సినిమా కంటెంట్ గురించి మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. విడుదల తేదీకి కేవలం కొద్దిరోజుల సమయం మాత్రమే ఉన్నా, ఇప్పటివరకు టీజర్ లేదా ట్రైలర్ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు.

Advertisement

Read also-Brahmamudi Serial Today Episode April 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందును కనిపెడతానన్న నందు

నిర్మాతల మౌనం..

ప్రమోషన్లలో కదలిక లేకపోవడంతో సోషల్ మీడియాలో సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం ఊపందుకుంది. “సినిమా ఏప్రిల్ 30న వస్తుందా? లేక మరో తేదీకి మారుతుందా? అనే విషయంలో నిర్మాతలు క్లారిటీ ఇవ్వాలి” అంటూ మెగా అభిమానులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా డిమాండ్ చేస్తున్నారు. బడ్జెట్ పరంగానూ, టెక్నికల్ వాల్యూస్ పరంగానూ బుచ్చిబాబు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ మౌనం కేవలం ‘సర్ ప్రైజ్’ ప్లాన్ లో భాగమా లేక షూటింగ్/పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం వల్లనా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా, ‘పెద్ది’ లాంటి భారీ ప్రాజెక్ట్ గురించి వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాలంటే.. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెంటనే స్పందించి ఒక అధికారిక ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×