E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహనిరి అనుమానించిన మిస్సమ్మ 

Nindu Noorella Saavasam Serial Today Episode April 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహనిరి అనుమానించిన మిస్సమ్మ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: హాస్పిటల్‌కు వచ్చిన మనోహరిని చూసిన మిస్సమ్మ కోల్‌కతా నుంచి ఇంత త్వరగా ఎలా వచ్చావని.. శ్రీనగర్‌ నుంచి రావడానికే మాకు గంటన్నర పట్టింది కానీ నువ్వెలా ఇంత పాస్ట్‌గా వచ్చావు అంటూ అడగ్గానే.. మనోహరి షాక్‌ అవుతుంది. ఆకాష్‌కు ఇలా అయిందని తెలిసి అష్టకష్టాలు పడి వచ్చాను.. అయినా నేను రావడం ముఖ్యం కానీ ఎలా వచ్చానని అంత అవసరమా భాగీ అనగానే.. రాథోడ్‌ అనుమానంగా మీరు కోల్‌కతా నుంచి వచ్చారా..? లేదా కాశ్మీర్‌ నుంచో కొడైకెనాల్‌ నుంచో వచ్చారా..? అంటాడు. దీంతో మనోహరి ఇరిటేటింగ్‌గా కోల్‌కతా వెళ్లిన దాన్ని అక్కడి నుంచే కదా తిరిగి వస్తాను. వేరే ప్లేస్‌ నుంచి ఎందుకు వస్తాను.. అయినా ఐసీయూలో ఈ డిస్కషన్‌ ఏంటి..? భాగీ మీరందరూ బయటకు వెళ్లండి ఆకాష్‌ దగ్గర నేను ఉంటాను అని చెప్పగానే..

మిస్సమ్మ నువ్వెందుకు మనోహరి నేను ఆయన ఉంటాము.. నువ్వు ఇంటికి వెళ్లిపో అనగానే.. మనోహరి కోపంగా ఆకాష్‌ను చూసుకోవాల్సింది నేను భాగీ. నువ్వు కాదు.. పిల్లల్ని తీసుకుని నువ్వే ఇంటికి వెళ్లు అనగానే.. మిస్సమ్మ లేదు నేను ఇక్కడే ఉంటాను. ఆకాష్‌ డిశ్చార్జ్‌ అయ్యాకే ఇంటికి వస్తాను అని చెప్పగానే.. అమర్‌ మెల్లగా రాథోడ్‌ నువ్వు పిల్లలను తీసుకుని ఇంటికి వెళ్లు వాళ్లు ఎక్కువ సేపు ఇక్కడ ఉండకూడదు అని చెప్పగానే.. రాథోడ్ ఓకే సార్‌.. ఆకాష్‌ బాబు మేము ఇంటికి వెళ్తున్నాను. ఇంటి దగ్గర నీకోసం ఎదురుచూస్తూ ఉంటాము అని చెప్పగానే. ఆనంద్‌ కూడా గెట్‌వెల్‌ సూన్‌ రా..  డాడ్‌ మిస్సమ్మ అందరూ ఇక్కడే ఉంటారు. నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు. అంజు కూడా ఆకాష్‌ నువ్వు ఇంటికి రాగానే మనం మళ్లీ పుట్‌బాల్‌ అడుకుందాం. ఈ సారి అన్ని గోల్స్‌ నీకే అని చెప్పగానే.. బుజ్జమ్మ కూడా జాగ్రత్త అన్నయ్య.. టేక్ కేర్‌ అనగానే.. ఆకాష్‌ థాంక్యూ బుజ్జమ్మ అంటాడు.

Advertisement

అమర్‌ పిల్లలను పంపిచేసి వస్తాను అంటూ వెళ్లిపోతాడు. మిస్సమ్మ ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకో ఆకాస్‌ ఇప్పటికే చాలా మాట్లాడావు.. రెస్ట్ తీసుకో అంటూ చెప్పి ఐసీయూ నుంచి బయటకు వస్తుంది. కారు దగ్గరకు వెళ్లిన అమర్‌.. పిల్లలు జాగ్రత్త రాథోడ్‌.. ఆకాష్‌ గురించి మీరెవ్వరూ ఆలోచించి వర్రీ అవ్వకండి.. ఎగ్జామ్స్‌ మీద కాంసట్రేషన్‌ చేయండి. ఆకాష్‌ను నేను మిస్సమ్మ చూసుకుంటాం. వెళ్లండి అంటూ పంపిచేస్తుంటే.. పక్కనే కారులో రణవీర్‌ ఉంటాడు. రాథోడ్ చూసి అమర్‌కు చెప్పగానే.. మీరు వెళ్లండి నేను చూసుకుంటాను అంటూ వాళ్లను పంపించి రణవీర్‌ దగ్గరకు వెళ్తాడు అమర్‌.. రణవీర్‌ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు.. అని అడగ్గానే.. రణవీర్‌ కోపంగా ఆ మాట నేను నిన్ను అడగాలి.. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అమర్‌. నా కూతురిని నాకు అప్పగిస్తానని చెప్పి నన్ను కాశ్మీర్‌ తీసుకెళ్లి చెప్పాపెట్టకుండా హైదరాబాద్‌ వచ్చావు.. నన్ను పిచ్చోడిని చేద్దాం అనుకుంటున్నావా..? అనగానే..

నా కొడుకు ఆకాష్‌కు హెల్త్‌ ఆప్‌సెట్‌ అయింది. అందుకే సడెన్‌గా రావాల్సి వచ్చింది అని అమర్‌ చెప్పగానే.. నేను నా కూతురు గురించి అడుగుతుంటే నువ్వు నీ కొడుకు గురించి చెప్తావేంటి అమర్‌. నా కూతురు ఎక్కడ..? అని నిలదీయగానే.. అమర్‌ కోపంగా అది చెప్పడానికి ఇది ప్లేస్ కాదు టైం కాదు.. మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే.. నీకు కుదిరినప్పుడు చెప్తానంటే నాకు కుదరదు అమర్‌.. నాకు సహనం ఓపిక రెండూ నశించిపోయాయి.. నేను ఇంక వెయిట్‌ చేయలేను.. మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పు అంటూ గట్టిగా అడగ్గానే.. తర్వాత చెప్తాను ఇప్పుడు నువ్వు వెళ్లు రణవీర్‌ అనగానే.. నేను ఉత్తి చేతులతో వెల్లడానికి రాలేదు.. నా కూతురును తీసుకెళ్లడానికి వచ్చాను. అంటూ రణవీర్‌ గొడవ చేస్తుంటే.. అమర్‌ కోపంగా రణవీర్‌కు వార్నింగ్‌ ఇస్తాడు. మీరు కని వదిలేస్తే నేను దత్తత తీసుకున్నాను మీకు నాకు చాలా తేడా ఉంది అంటూ అమర్‌ వార్నింగ్‌ ఇస్తాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

Big Stories

Advertisement
×