E-Paper
Advertisement

Peddi Movie: కళ్ళు చెదిరే ధరకు పెద్ది డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?

Peddi Movie: కళ్ళు చెదిరే ధరకు పెద్ది డిజిటల్ రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా(Peddi) షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2026 మార్చి 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ ఇటీవల చిత్రం ప్రకటించారు అయితే ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు సినిమా విడుదల వాయిదా గురించి చిత్ర బృందం ఎక్కడ అధికారకంగా స్పందించలేదు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తోంది.

అంచనాలు పెంచిన చికిరి చికిరి సాంగ్..

ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసే పనులలో బుచ్చిబాబు ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్ వీడియో కానీ అలాగే ఫస్ట్ సింగిల్ భారీ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా నుంచి త్వరలోనే మరో పాటను కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా పెద్ది సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రూ.130 కోట్లకు డిజిటల్ రైట్స్..

ఈ సినిమా డిజిటల్ బిజినెస్ క్లోజ్ అయిందని సమాచారం ఈ సినిమా డిజిటల్ హక్కులను అన్ని భాషల్లో కలిపి నెట్ ఫ్లిక్స్(Net Flix) ఏకంగా 130 కోట్లకు కైవసం చేసుకున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.. ఇలా అన్ని భాషలలో కలిపి 130 కోట్లు అంటే మామూలు విషయం కాదు భారీ ధరలకు పెద్ది డిజిటల్ బిజినెస్ క్లోజ్ అయిందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమా విడుదల గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు మరోసారి సందిగ్ధంలో పడ్డారు.

గ్రామీణ క్రీడా నేపథ్యం..

ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ కు జోడిగా జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనున్నారు. ఇందులో ఈమె అచ్చియమ్మా అనే పాత్రలో క్రికెట్ కామెంటేటర్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం కచ్చితంగా రాంచరణ్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోబోతున్నారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన RRR తరువాత ఆచార్య, గేమ్ చేంజర్ వంటి సినిమాల ద్వారా చరణ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను నిరాశపర్చిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: The Girl Friend OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రష్మిక ది గర్ల్ ఫ్రెండ్.. ఎప్పుడంటే?

Related News

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

Big Stories

×