E-Paper
Advertisement

The Girl Friend OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రష్మిక ది గర్ల్ ఫ్రెండ్.. ఎప్పుడంటే?

The Girl Friend OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రష్మిక ది గర్ల్ ఫ్రెండ్.. ఎప్పుడంటే?
Advertisement

The Girl Friend OTT: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. (The Girl Friend)నటుడు రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో రష్మిక లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే .ఇలా రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా కాలేజీ లవ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాకు ఎంతో అద్భుతమైన ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 5న రాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్..

ఈ సినిమా థియేటర్లో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో తిరిగి ఓటీటీలో ప్రసారం కావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతోంది అంటూ నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన వెల్లడించారు. ఈ సినిమాను థియేటర్లలో చూడటం మిస్సయిన వారు డిసెంబర్ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇక ఇందుకు సంబంధించిన ఈ విషయాన్ని షేర్ చేస్తూ భూమా దేవిని డిసెంబర్ ఐదవ తేదీ నెట్ ఫ్లిక్స్ లో కలవండి అంటూ ఈ విషయాన్ని అధికారకంగా వెల్లడించారు.

నెలరోజుల్లోనే ఓటీటీలోకి..

Advertisement

ఇలా రష్మిక నటించిన ఈ సినిమా నెల రోజుల వ్యవధిలోని తిరిగి ఓటీటీలోకి రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడు నిర్మాతలుగా వ్యవహరించారు ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రష్మిక కెరియర్ లో ఎంతో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయిందని చెప్పాలి.

https://twitter.com/Netflix_INSouth/status/1995002354437935446?t=AMPSsY0uOYGAbws7eT3QrA&s=08

Advertisement

ఈ సినిమాకు పెద్ద ఎత్తున సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక మరో నాలుగు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె మైసా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు ఈ సినిమాతో పాటు కాంచన 4, అల్లు అర్జున్ అట్లీ, విజయ్ దేవరకొండతో కలిసి కూడా ఒక సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. రష్మిక విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహం 2026 ఫిబ్రవరి 26వ తేదీ ఉదయపూర్ లో జరగబోతోంది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి కానీ ఇప్పటివరకు వీరి పెళ్లి గురించి ఎక్కడ అధికారిక ప్రకటన మాత్రం వెలబడలేదు.

Also Read: Dil Raju: ఎల్లమ్మ, రౌడీ జనార్ధన్ షూటింగ్ అప్డేట్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×