Peddi Event : జూన్ 4 ..అంటే అటు ఇటుగా మరో పది రోజుల్లో పెద్ది సినిమా రిలీజ్…అందులో భాగంగా ప్రమోషన్స్ లో వేగం పెంచేసింది మూవీ టీమ్.ఇక ఇప్పటికే పోస్టర్స్ ,గ్లిమ్ప్స్,సాంగ్స్ అంటూ వరుస అప్ డేట్స్ వదిలిన మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. భోపాల్లోని సుమారు 50 ఎకరాలున్న ప్రతిష్టాత్మక బీహెచ్ఈఎల్ (BHEL) దసరా గ్రౌండ్ లో ఎప్పుడు కనీ వినీ ఎరుగని స్థాయిలో ఒక భారీ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారట.ఇక అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మాత్రం కేవలం సినిమా ప్రమోషన్ల కోసమే ఇంత భారీ ఎత్తున, ఇంతపెద్ద మైదానంలో ఒక ఈవెంట్ నిర్వహించడం భారతీయ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా నిలవడం ఖాయం.
స్టేజ్ పైన పెర్ఫార్మ్ చేయబోతున్న రెహమాన్
చాలా గ్రాండ్ గా జరగనున్న ఈ ఈవెంట్ లో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానాతో పాటు ప్రముఖులు ఎంతో మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.ఇక ఈ ఈవెంట్ లో ‘పెద్ది’ సినిమా నుంచి రెండు అద్భుతమైన పాటలను ఏఆర్ రెహమాన్ మరియు అతని బృందం లైవ్ లో స్టేజ్ పైన పెర్ఫార్మ్ చేయబోతున్నారని సమాచారం.దీంతో రెహమాన్ నుంచి వస్తున్న ఈ సరికొత్త ట్యూన్స్ ఎలా ఉండబోతున్నాయో అని ఇప్పటి నుండే క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్.
also read :‘దేవర 2’కు ఎన్టీఆర్ గుడ్ బై? అందుకోసమే కొరటాలను పక్కన పెట్టేసారా!
కేవలం కొత్త పాటలు మాత్రమే కాకుండా, రెహమాన్ తన కెరీర్‌లో అందించిన ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్ సాంగ్స్, అలాగే ఆయన గత చిత్రాలలోని ఐకానిక్ హిట్ సాంగ్స్‌ను కూడా ఈ వేదికపై లైవ్ కాన్సెర్ట్ రూపంలో పర్ఫార్మ్ చేయబోతున్నారని ఇన్ సైడ్ టాక్.మొత్తంగా ఈ ఈవెంట్ కేవలం ఒక సినిమా వేడుకలా కాకుండా, ఒక అంతర్జాతీయ స్థాయి మ్యూజిక్ కన్సర్ట్ లా మారబోతుందట.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ ఈవెంట్
ఇక పెద్ది’ చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి ఒక భారీ ఈవెంట్‌ను ఎవరూ ప్లాన్ చేయలేదని, సినిమా ప్రమోషన్ల పరంగా ఇదొక ట్రెండ్ సెట్టర్ కాబోతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారట మేకర్స్.సినిమా విషయానికి వస్తే రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక పవర్‌ఫుల్ రా రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా ఏ రేంజ్ లో ఇండస్ట్రీని షేక్ చేసిందో మనకు తెలిసిందే. మళ్లీ అదే తరహా పల్లెటూరి వాతావరణంలో, అంతకు మించిన ఎమోషన్స్ మరియు యాక్షన్‌తో బుచ్చిబాబు ఈ కథను సిద్ధం చేశాడట డైరెక్టర్ బుచ్చి బాబు .
ఎన్ని రికార్డ్స్ కి తెరతీస్తుందో
ఇక ఈ ఈవెంట్ కోసం భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ గ్రౌండ్స్‌లో కళ్ళు చెదిరే లైటింగ్, మైండ్ బ్లోయింగ్ సౌండ్ సిస్టమ్స్‌తో భారీ స్టేజ్ నిర్మాణాన్ని ఇప్పటికే కంప్లీట్ చేసేశారట కూడా.ఈ వేడుకకు లక్షలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు మరియు ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్స్ భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. చూడాలి మరి అట్టహాసంగా జరగబోయే ఈ ఈవెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎన్ని రికార్డ్స్ కి తెరతీస్తుందో.
also read :రమణి కళ్యాణం రివ్యూ..పాజిటివ్ బజ్ అనుకుంటే.. థియేటర్లో సీన్ రివర్స్ అయిందిగా!