E-Paper
Advertisement

బెజవాడ గడ్డపై ‘పెద్ది’ జాతర.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా!

బెజవాడ గడ్డపై ‘పెద్ది’ జాతర.. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా!
Advertisement

Peddi Pre Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ ప్రీ-రిలీజ్ వేడుకకు బెజవాడ నగరం ముస్తాబైంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం ఈ చారిత్రాత్మక మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఎన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read also-తెలియక చేసిన తప్పు.. ప్రాణాల మీదకు తెచ్చిన ‘క్లీనింగ్’ జాబ్!

బాబాయ్-అబ్బాయ్ ఒకే వేదికపై..

Advertisement

ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. బాబాయ్, అబ్బాయ్ ఒకే వేదికపై కనిపించబోతుండటంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి అభిమానులు విజయవాడకు తరలివస్తున్నారు. ఇటు రాజకీయంగా, అటు సినిమా పరంగా ఈ కలయిక టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా నిలిచిపోనుంది.

తరలిరానున్న సినీ ప్రముఖులు

ఈ వేడుకలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరితో పాటు చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివరాజ్‌కుమార్, వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు, అలాగే టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నటీనటులు, దర్శకులు ఈ వేదికపై సందడి చేయనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజికల్ లైవ్ పర్ఫార్మెన్స్ ఈ ఈవెంట్‌కు మరో ప్రధాన హైలైట్ కానుంది.

భారీ భద్రతా ఏర్పాట్లు

Advertisement

లక్షలాది మంది అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేడియం పరిసరాల్లో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా దాదాపు 1,000 మందికి పైగా పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు క్యూఆర్ (QR) కోడ్ ఆధారిత రూట్ గైడెన్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. పాస్ హోల్డర్లు తమ పాస్‌లపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తమకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్‌లను సులువుగా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

Read also-మెగా ఫ్యాన్స్ హంగామా.. ‘పెద్ది’ రిలీజ్ వేళ బుచ్చిబాబు కటౌట్ వైరల్!

సినిమా విడుదల ఎప్పుడంటే?

1980ల నాటి రూరల్ ఆంధ్రా నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అంతకంటే ముందే, జూన్ 3వ తేదీ రాత్రి నుంచే ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేసింది. బెజవాడ గడ్డపై జరగబోయే ఈ ‘పెద్ది’ జాతర, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులకు నాంది పలకడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×