E-Paper
Advertisement

గుజరాత్ టైటాన్స్‌కు కలిసిరాని కాలం.. దెబ్బ మీద దెబ్బ, ఫైనల్‌లో ఓటమి, ఆపై బస్సులో మంటలు

గుజరాత్ టైటాన్స్‌కు కలిసిరాని కాలం.. దెబ్బ మీద దెబ్బ, ఫైనల్‌లో ఓటమి, ఆపై బస్సులో మంటలు
Advertisement

Gujarat Titans: ఐపీఎల్-2026 టోర్నమెంట్‌లో ఈసారి గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఏమైంది? దెబ్బ మీద దెబ్బ ఎందుకు తగిలింది? లీగ్ దశలో పుల్ జోష్ లో ఉన్న ఆ జట్టు ఎందుకు బొక్క బోర్లా పడింది? దీనికితోడు ఫైనల్ లో ఓటమి ఒకెత్తయితే.. ఆ జట్టు ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడం మరో కారణమైంది.

గుజరాత్ టైటాన్స్‌కు కలిసిరాని కాలం

Advertisement

ఐపీఎల్‌-2026 ఫైనల్లో ఓటమితో నిరాశలో కూరుకుపోయింది గుజరాత్ టైటాన్స్ జట్టు. మ్యాచ్ తర్వాత బస్సులో రూమ్‌కి వెళ్తున్న సమయంలతో ఆ జట్టుకు పెను ప్రమాదం తప్పింది. జట్టు సభ్యులు ప్రయాణిస్తున్న బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, క్షణాల్లో బస్సు దిగిపోయారు.

టీమ్ అంతా సురక్షితంగా కిందకు దిగడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. దీంతో కాసేపు ఆటగాళ్లు రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆటగాళ్లు రోడ్డు మీద కూర్చన్న సమయంలో హైదరాబాద్ ఆటగాడు సిరాజ్ అందుకు ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.

Advertisement

ఫైనల్‌లో ఓటమి, ఆపై బస్సులో మంటలు.. రోడ్లపై ఆటగాళ్లు

రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది జీటీ. ఒక విధంగా గుజరాత్ టైటాన్స్ అతి విశ్వాసం ఆ జట్టు కొంప ముంచిందని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఈ టోర్నీలో సొంత మైదానంలో ఆ జట్టు ఓడిపోయిన సందర్భాలు చాలా తక్కువ.

ఆ మైదానంలో వేరే జట్టు ఆటగాళ్లు సిక్సులు కొట్టేందుకు చాలా ఇబ్బందిపడేవారు. అలాంటి 13 ఓవర్ల వరకు ఆ జట్టు ఒక్క సిక్స్ కొట్టలేదంటూ పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాప్ ఆర్డర్స్ విఫలమైతే మిగతా ఆటగాళ్లు ఏమీ ఆడలేరని మరోసారి ఆ జట్టు నిరూపించింది.

ALSO READ: గుజ‌రాత్ టైటాన్స్ గొంతు కోశారు..ఫైనల్ మ్యాచ్ మ‌ళ్లీ నిర్వ‌హించాల్సిందే !

దీనిపై ఆ జట్టు మేనేజ్‌మెంట్ వెర్షన్ మరోలా వుంది. ఫైనల్‌లో జట్టు ఓటమికి ప్రయాణం ఓ కారణమా అని మీడియా ప్రశ్నించినప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టు డైరెక్టర్ విక్రమ్ సోలంకి మరోలా రియాక్ట్ అయ్యారు. కొన్నాళ్లుగా మ్యాచ్‌లు ఆడడం, ఆపై ట్రావెలింగ్ కూడా జట్టుపై పడిందని అంటున్నారు. అలా చెప్పి ఆర్‌సీబీ విజయాన్ని తక్కువ చేయదల్చుకోలేదన్నారు. ప్రత్యర్థి జట్టు అద్భుతంగా ఆడిందంటూ కితాబు ఇచ్చారు.

Related News

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

Big Stories

Advertisement
×