E-Paper
Advertisement

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్
Advertisement

Peddi Premiere: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ఎట్టకేలకి థియేటర్లలోకి వచ్చేసింది. గత కొన్ని నెలలుగాఇటు నెట్టింట్లోనూ,ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ సినిమాపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు.ఆ అంచనాలకు తగ్గట్టే జూన్ 3 బుధవారం రాత్రి నుంచే వరల్డ్ వైడ్ గా ప్రీమియర్ షోల సందడి మొదలైపోయింది.

జూన్ 4 గురువారం నాడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనే కాకుండా, ఇండియన్ సినిమా సర్కిల్స్‌లోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. ఒక క్రీడాకారుడి కథాంశంతో వస్తున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ఊరమాస్ లుక్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో చరణ్ నటన కెరీర్ బెస్ట్ అనిపించేలా ఉందట.

Advertisement

పెద్ది’ టీమ్‌కు విషెస్ చెప్పిన స్టార్స్

ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందోనని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మెగా 158’ చిత్రం ప్రస్తుతం పొల్లాచి షెడ్యూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, దర్శకుడు బాబీ నేతృత్వంలోని ఆ చిత్ర బృందం సెట్స్ నుంచే ప్రత్యేకంగా ఒక వీడియో బైట్‌ను విడుదల చేసి ‘పెద్ది’ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్ చెప్పడం విశేషం.

Advertisement

రామ్‌చరణ్‌తో ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సమంత, ఈ సినిమాపై తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. చరణ్‌లోని అసలైన టాలెంట్ ఈ సినిమాతో మరోసారి బయటకు రాబోతుందని, ఇందులో తనకు పూర్తిస్థాయి బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయనిఆకాశానికి ఎత్తేసింది. ఇక చరణ్ తమ్ముడు వరుణ్ తేజ్ సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, ఈ క్యారెక్టర్ కోసం చరణ్ పడ్డ కష్టం, అంకితభావం తనకు పర్సనల్‌గా తెలుసని, బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ బ్యాటింగ్ అదరగొట్టడం ఖాయమని స్పష్టం చేశాడు.

గుండెలను పిండేస్తాయంటున్న నెటిజన్లు

ఇక సాయి దుర్గ తేజ్, అనిల్ రావిపూడి వంటి ప్రముఖులు సోషల్ మీడియాను షేక్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతుండటంతో ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై #Peddi హ్యాష్‌ట్యాగ్ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా, సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో మెరిశారు. సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఫస్టాఫ్ అంతా చరణ్ క్యారెక్టరైజేషన్, ఎమోషనల్ రైడ్‌తో సాగితే, సెకండాఫ్‌లో వచ్చే ఒక నిర్దిష్టమైన సీన్ థియేటర్లలో ఆడియన్స్‌తో ఈలలు, చప్పట్లు కొట్టించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా జాన్వీ కపూర్ నటన కెరీర్ మైల్‌స్టోన్‌లా నిలిచిపోతుందని, ఒక కీలక సన్నివేశంలో ఆమె పండించిన హావభావాలు ప్రేక్షకుల గుండెలను పిండేస్తాయని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

కలెక్షన్ల సునామీ ఏ రేంజ్‌లో ఉంటుందో

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయని, ఆర్‌ఆర్‌తోనే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని సినిమా చూసిన మూవీ లవర్స్  అభిప్రాయపడుతున్నారు. ఉప్పెన చిత్రంతో దర్శకుడిగా మెగా డెబ్యూ ఇచ్చి సంచలనం సృష్టించిన బుచ్చిబాబు, ఈసారి చరణ్‌ను సరికొత్త యాంగిల్‌లో ప్రెజెంట్ చేయడంలో వంద శాతం సక్సెస్ అయ్యాడని తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. థియేటర్ల వద్ద ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొనగా, రానున్న రోజుల్లో ‘పెద్ది’ సృష్టించే కలెక్షన్ల సునామీ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

Also read :పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

Related News

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

Big Stories

Advertisement
×