E-Paper
Advertisement

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్
Advertisement

Best office desk workouts: ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగాలు కంప్యూటర్ల ముందే సాగుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుర్చీకే పరిమితం కావడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. దీని వల్ల పొట్ట చుట్టూ కొవ్వు చేరడం, బరువు పెరగడం, వెన్నునొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి. జిమ్‌కు వెళ్దామంటే టైమ్ ఉండదు. మరి దీనికి పరిష్కారం లేదా? అంటే ఖచ్చితంగా ఉంది! మనం ఆఫీస్ కుర్చీలో కూర్చునే బరువు తగ్గడం సాధ్యమే. సీట్లోనే ఉంటూ క్యాలరీలు ఎలా బర్న్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కుర్చీలో కూర్చుని చేసే బెస్ట్ డెస్క్ వర్కవుట్స్ :

Advertisement

మీరు పని చేస్తూనే గంటకు ఒకసారి కేవలం 2 నుంచి 3 నిమిషాలు కేటాయించి కింద పేర్కొన్న సింపుల్ ఎక్సర్‌సైజెస్ చేయవచ్చు.

సీటెడ్ లెగ్ రైజెస్ : కుర్చీలో నిటారుగా కూర్చోండి. మీ కుడి కాలును నేలకు సమాంతరంగా పైకి లేపి 5 సెకన్లు ఉంచండి. తర్వాత కిందకు దించి ఎడమ కాలుతో అలాగే చేయండి. ఇది మీ థైస్ (తొడలు), పొట్ట కండరాలను బలంగా ఉంచుతుంది.

Advertisement

డెస్క్ పుష్-అప్స్: కొద్దిగా బ్రేక్ దొరికినప్పుడు మీ ఆఫీస్ టేబుల్‌పై చేతులు ఉంచి, కాళ్లను వెనకకు చాపి పుష్-అప్స్ చేయండి. ఇది మీ ఛాతి , చేతుల కండరాలకు మంచి వ్యాయామం.

చైర్ ట్విస్ట్ : కుర్చీలో కూర్చుని మీ అప్పర్ బాడీని (నడుము పైభాగాన్ని) ఒకసారి కుడివైపునకు, మరోసారి ఎడమవైపునకు తిప్పండి. దీనివల్ల నడుము చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.

సీటెడ్ అబ్ క్రంచెస్ : కుర్చీ అంచున కూర్చుని చేతులు తల వెనుక పెట్టండి. మీ మోకాళ్లను పైకి లేపుతూ మోచేతులతో తాకడానికి ప్రయత్నించండి. పొట్ట తగ్గడానికి ఇది సూపర్ హ్యాక్.

మరిన్ని మార్గాలు:

1. అండర్ డెస్క్ పెడల్ ఎక్సర్‌సైజర్:
ఇది చిన్న సైకిల్ పెడల్స్ లాగా ఉంటుంది. మీ ఆఫీస్ టేబుల్ కింద దీనిని పెట్టుకుని, మీరు సిస్టమ్ ముందు పని చేసుకుంటూనే కాళ్లతో తొక్కుతూ ఉండొచ్చు.

2. రెసిస్టెన్స్ బ్యాండ్స్:
వీటిని కుర్చీకి కట్టుకుని చేతులతో లాగడం ద్వారా సింపుల్ గా స్ట్రెచింగ్స్ చేయవచ్చు. బాడీ టోనింగ్‌కి ఇవి బాగా ఉపయోగపడతాయి.

3. ఆక్యుప్రెజర్ మ్యాట్ లేదా ఫుట్ రోలర్ :
కూర్చున్నప్పుడు కాళ్ల కింద దీనిని ఉంచి రోల్ చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అంతే కాకుండా మెటబాలిజం పెరుగుతుంది.

Related News

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

Big Stories

Advertisement
×