E-Paper
Advertisement

Peddi vs Paradise: యువ దర్శకుల మధ్య ఈగో క్లాష్… సందేహాలు రేపుతున్న ది ప్యారడైస్–పెద్ది వివాదం..!

Peddi vs Paradise: యువ దర్శకుల మధ్య ఈగో క్లాష్… సందేహాలు రేపుతున్న ది ప్యారడైస్–పెద్ది వివాదం..!
Advertisement

Peddi vs Paradise: టాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో యువ దర్శకులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు చాలా గందరగోళానికి నిద్ర లేపుతున్నాయి. ముఖ్యంగా సినిమా విడుదల తేదీల విషయంలో జరుగుతున్న గందరగోళం అభిమానుల్లో అయోమయం కలిగిస్తోంది. తాజాగా The Paradise సినిమాకు సంబంధించిన షెడ్యూల్ విషయమే ఇందుకు ఉదాహరణగా మారింది.

సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ది ప్యారడైస్ కొత్త షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ సుమారు 15 నుంచి 20 రోజుల పాటు కొనసాగుతుంది. అయితే ఈ షెడ్యూల్‌తో సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ మాత్రమే పూర్తవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ షూటింగ్ మొత్తం పెండింగ్‌లోనే ఉంది. అంటే సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడే అవకాశముంది.

Advertisement

అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే గతంలో మార్చి 26న సినిమా విడుదల అవుతుందని ప్రకటించారు. షూటింగ్ సగం కూడా పూర్తికాకముందే రిలీజ్ డేట్ ప్రకటించడం ఎందుకు అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఈ ప్రకటన వల్ల అనవసరమైన చర్చలు, అంచనాలు పెరిగాయి. నిజానికి సినిమా పరిస్థితిని చూసి చాలా ముందే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించి ఉంటే ఇలాంటి గందరగోళం ఉండేది కాదు.

ఇక మరోవైపు పెద్ది.. సినిమా కూడా ఇదే సమయానికి విడుదలకు సిద్ధమవుతుందని ప్రచారం జరిగింది. ది ప్యారడైస్ టీమ్ ముందుగా డేట్ ప్రకటించగా, ఆ తర్వాత పెడ్డి టీమ్ అదే టైమ్‌కి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. దీంతో రెండు సినిమాల మధ్య అహంకార పోటీ ఉందా? ఒక సినిమా వాయిదా వేస్తేనే మరొకటి నిర్ణయం తీసుకుంటుందా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

Advertisement

ఇది నిజంగా అహంకార సమస్యేనా..లేక వ్యూహాత్మకంగా ఎదురు చూసే నిర్ణయమా? అన్నది స్పష్టంగా తెలియడం లేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రకటించిన తేదీలకు ఈ రెండు సినిమాలూ విడుదల కావడం కష్టమే.

ఇప్పుడు ప్రేక్షకులు..అభిమానులు ఎదురు చూస్తున్నది ఒక్కటే. అధికారిక ప్రకటన. ఊహాగానాలకు ముగింపు పెట్టి, స్పష్టమైన రిలీజ్ ప్లాన్‌ను మేకర్స్ వెల్లడించాల్సిన అవసరం ఉంది. అప్పటి వరకూ ఈ చర్చలు కొనసాగుతూనే ఉంటాయి.

ALSO READ: Mrunal Thakur : బ్లూ డ్రెస్ లో సింపుల్ లుక్ లో మృణాల్ ఫోటో షూట్.. క్యూట్ అంతే..

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×