E-Paper
Advertisement

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ‘లాక్‌డౌన్’ ఫీచర్.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చుకోకుంటే మీ అకౌంట్ రిస్క్‌లో పడ్డట్టే!

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ‘లాక్‌డౌన్’ ఫీచర్.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చుకోకుంటే మీ అకౌంట్ రిస్క్‌లో పడ్డట్టే!
Advertisement

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ దిగ్గజం వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను పరిచయం చేసింది. హ్యాకర్లు, సైబర్ నేరుగాళ్ల ఉచ్చులో పడకుండా రక్షణ కల్పించడమే లక్ష్యంగా తాజాగా Strict Account Settings అనే కీలకమైన అప్‌డేట్‌ను ప్రకటించింది. ముఖ్యంగా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, సెలబ్రెటీలకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మెటా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏంటీ స్ట్రిక్ట్ అకౌంట్ సెట్టింగ్స్?

సాధారణంగా సైబర్ దాడులు ఫోన్లలోని మీడియా ఫైల్స్ లేదా అటాచ్‌మెంట్ల ద్వారా జరుగుతుంటాయి. ఈ కొత్త ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే.. మీ కాంటాక్ట్ లిస్టులో లేని వ్యక్తుల నుండి వచ్చే ఫొటోలు, వీడియోలు లేదా ఇతర డాక్యుమెంట్లు ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతాయి. అంటే.. ఈ ఫీచర్ మీ అకౌంట్‌ను లాక్‌డౌన్ మోడ్ లోకి తీసుకెళ్తుంది. దీంతో బయటి వ్యక్తుల నుండి వచ్చే అనవసరమైన రిస్క్‌ తగ్గుతుంది. మీరు దీన్ని సెట్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్‌లోని Settings > Privacy > Advanced సెక్షన్‌లోకి వెళ్లి మార్పులు చేసుకోవచ్చు.

Advertisement

Also Read: ఫిబ్రవరిలో స్మార్ట్‌ఫోన్ల జాతర.. శాంసంగ్ నుంచి మోటో వరకు షేక్ చేయనున్న టాప్-5 మొబైల్స్!

భద్రత కోసం Rust లాంగ్వేజ్:

కేవలం సెట్టింగ్స్ మాత్రమే కాకుండా.. వాట్సాప్ తన కోడింగ్ వ్యవస్థలో కూడా భారీ మార్పులు చేసింది. మీడియా ఫైల్స్ పంపేటప్పుడు మరింత భద్రతను కల్పించడానికి Rust అనే మెమరీ సేఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను ప్రవేశపెట్టింది. పాత పద్ధతిలో ఉన్న సుమారు 1.6 లక్షల లైన్ల C++ కోడ్‌ను తొలగించి.. కేవలం 90వేల లైన్ల రస్ట్ కోడ్‌తో వేగవంతమైన, సురక్షితమైన వ్యవస్థను సిద్ధం చేసింది. దీంతో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నప్పుడు హ్యాకర్ల బారిన పడే అవకాశం ఉండదు.

ఎప్పడికప్పుడు మెరుగులు:

Advertisement

వాట్సాప్ డెవలపర్లు గతకొన్ని ఏళ్లుగా సిస్టమ్ బగ్స్ కనిపెట్టడానికి ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఆటోమేటెడ్ సెక్యూరిటీ అనాలిసిస్ ద్వారా ఎప్పటికప్పుడు బగ్స్‌ను సరిదిద్దుతున్నారు. స్పైవేర్ దాడుల నుండి వినియోగదారులను కాపాడటమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు మెటా తెలిపింది.

Also Read: మార్కెట్ షేక్ అవ్వాల్సిందే.. మోటరోలా కొత్త ఫోన్ స్పెసిఫికేషన్స్ లీక్, పూర్తి వివరాలు ఇవిగో!

 

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×