E-Paper
Advertisement

Peddi Movie : రిలీజ్ కు ముందే ‘పెద్ది’ నయా రికార్డు.. ఓవర్సీస్ లో ఊచకోత..

Peddi Movie : రిలీజ్ కు ముందే ‘పెద్ది’ నయా రికార్డు.. ఓవర్సీస్ లో ఊచకోత..
Advertisement

Peddi Movie : ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు మొత్తం పెద్ది సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది .. ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై దేశవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది.. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ రికార్డుల మోత మోగిస్తుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన గేమ్స్ అలాగే పోస్టర్లు, సాంగ్స్ ద్వారా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ సంచలన రికార్డు క్రియేట్ చేసుకొని వార్తల్లో నిలిచింది. నార్త్ అమెరికాలో పెద్ది మూవీ బిజినెస్ ఎలా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం.

నార్త్ అమెరికాలో పెద్ది రికార్డ్..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి వస్తున్న పెద్ది సినిమాకు రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.. తాజాగా ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఇంకాస్త రెట్టింపు అయ్యాయి.. ప్రస్తుతం ఈ మూవీ బిజినెస్ దూసుకుపోతుంది.. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా రిలీజ్ అవ్వకుండానే రికార్డులను వరుసగా బ్రేక్ చేస్తూ వస్తుంది. తాజాగా నార్త్ అమెరికాలో ఊచకోత మొదలుపెట్టింది. ఈ మూవీ బుకింగ్స్ ప్రారంభమైన కేవలం కొద్ది గంటల్లోనే 100,000 అమెరికన్ డాలర్లు క్రాస్ చేసి, తర్వాత వరుసగా 250,000 అమెరికన్ డాలర్లు, 300,000 అమెరికన్ డాలర్ల మైలురాళ్లను దాటింది. అంటే ఓవర్సీస్ లో దాదాపు మూడు కోట్ల బిజినెస్ ఈ సినిమాకు జరిగింది.. ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం మామూలు విషయం కాదు.. ఓవర్సీస్ లో పెద్ద టార్గెట్ కాస్త ఎక్కువగానే ఉంది.

Advertisement

Also Read :జాన్వీ కపూర్ కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా..? వామ్మో లక్షలే..

స్పోర్ట్స్ డ్రామా స్టోరీతో..

రామ్ చరణ్ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.. కానీ ఇప్పుడు వస్తున్న పెద్ది సినిమా మాత్రం కాస్త డిఫరెంట్ గానే ఉంటుంది.. గతంలో ఎన్నడు చూడని రామ్ చరణ్ ని ఈ సినిమాలో చూడొచ్చు.. ఇది ఒక కంప్లీట్ గ్రామీణ స్టోరీ.. 1980ల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ కథలో, ఒక సాధారణ యువకుడు స్పోర్ట్స్‌ మీద ఆసక్తితో సమాజాన్ని ఏకం చేసే స్టోరీతో మూవీ రాబోతుంది. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషనల్ కోర్ కూడా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ జనాల్లో ఆసక్తిని కలిగించింది. ఇకపోతే ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ రామ్ చరణ్ కి జోడిగా నటిస్తుంది.. శివ రాజ్ కుమార్, జగపతి బాబు వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.. జూన్ 4న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.. దీని తర్వాత సుకుమార్ కాంబినేషన్లో రామ్ చరణ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. త్వరలోనే ఆ మూవీ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×