E-Paper
Advertisement

Dandora Movie: శివాజీ ‘దండోరా‘ నుంచి లవ్ సాంగ్.. లవర్ బాయ్ గా బిగ్ బాస్ రవికృష్ణ

Dandora Movie: శివాజీ ‘దండోరా‘ నుంచి లవ్ సాంగ్.. లవర్ బాయ్ గా బిగ్ బాస్ రవికృష్ణ

Dandora Song Release: బిగ్ బాస్ ఫేం, నటుడు శివాజీ, నవదీప్, నందు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘దండోరా‘. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు ప్రమోషన్స్ ని జరుపుకుంటుంది ఈ మూవీ. ఇందులో భాగంగా ఈ చిత్రంలోని లవ్ సాంగ్ ని తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ‘దండోరా కొట్టుకుందురో.. గుండెల్లో కొత్త‌గుందిరో.. నింగి నేల ఇలా..దారి కుదిరిందెలా.. క‌ళ్లారా చూడ‌బోతినో.. క‌ల్లోలం లాగ ఉంట‌దే.. దాగి దాగి అలా ద‌గ్గ‌రైపోయావే ఇలా.. పిల్లా ఇట్ట‌సూడ‌వే.. తొంగి న‌న్ను చూడ‌వేఅంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ పాటను అదితి భావ‌రాజు, అనురాగ్ కుల‌క‌ర్ణి పాడారు. పూర్ణా చారి సాహిత్యం అందించారు.

మనసులను హత్తుకునేలా

ప్రేమికుల మ‌న‌సుల్లో దాగిన భావాల‌ను ఆవిష్క‌రించిన ఈ పాట సంగీత ప్రియులను మనసును హత్తుకునేలా ఉంది. పైగా తెలంగాణ యాసలో సాగుతున్న ఈ లవ్ సాంగ్ యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన గంటల్లోనే మంచి వ్యూస్ అందుకుంది. ప్రస్తుతం ఈ పాటకు యూట్యూబ్ లో భారీ రెస్పాన్స్ వస్తుంది. కాగా బిగ్ బాస్ ఫేం, టీవీ నటుడు రవికృష్ణ, మోనికాల మధ్య ఈ పాట సాగింది. క‌ల‌ర్ ఫొటో’, బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘బెదురులంక 2012’ వంటి విలక్షణమైన చిత్రాల‌ను నిర్మించి మంచి గుర్తింపు పొందిన లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

టీజర్ కు మంచి రెస్పాన్స్

ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, టీజర్ తో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. పైగా కోర్టు లాంటి మూవీలో మంగపతి పాత్రలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు శివాజీ. ఈ చిత్రం ఆయన నటిస్తున్న మూవీ ఇది. దీంతో మూవీకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు ఇందులో నందు, నవదీప్, బింధు మాధవిలు కీలక పాత్రలు పోషించడం మరింత ఆకట్టుకుంటున్న అంశం. ఈ క్రమంలో శివాజీ, నవదీప్, నందులు కలిసి మూవీని ప్రమోషన్స్ చేస్తూ దండోరాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. పలు ఇంటర్య్వూలో శివాజీ చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నారు. అదే టైంలో దండోరా మూవీ పేరు మారుమ్రోగుతుంది. ఇది మూవీ ప్రమోషన్స్ కి మరింత ప్లస్ అవుతుంది. మొత్తానికి బలగం, బాపు వంటి చిత్రాల తర్వాత తెలంగాణ నేపథ్యంలో వస్తున్న మరో చిత్రమే దండోరా.

కథేంటంటే

మరి డిసెంబర్ క్రిస్మస కానుక రాబోతున్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందనేది ఆసక్తిని సంతరించుకుంది. దండోరా సినిమా సామాజిక స్పృహను కలిగించే అంశంతో తెరకెక్కుతున్నట్టు మూవీ టీం చెబుతుంది. అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతుందే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ ముర‌ళీకాంత్. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు.

Related News

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

Big Stories

×