E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu Day 84 : తనూజపై నాగ్ సెటైర్లు… కొడుకుతో సహా సంజనాను టార్గెట్ చేసిన హౌస్ మేట్స్… దివ్యకు బైబై

Bigg Boss 9 Telugu Day 84 : తనూజపై నాగ్ సెటైర్లు… కొడుకుతో సహా సంజనాను టార్గెట్ చేసిన హౌస్ మేట్స్… దివ్యకు బైబై
Advertisement

Bigg Boss 9 Telugu Day 84 : నిన్న హౌస్ మేట్స్ ఒక్కొక్కరినీ ఉతికి ఆరేసిన నాగార్జున ఈరోజు ఫుల్ ఎనర్జీతో సండే ఫన్ డే ఎపిసోడ్ ను స్టార్ట్ చేశారు. రాగానే సుమన్ డ్రెస్ పై ప్రశంసలు కురిపించిన నాగ్, తరువాత హౌస్ మేట్స్ ను రెండు టీమ్ లుగా విడగొట్టారు. ఒక టీంలో డెమోన్, రీతూ, పవన్, భరణి ఉంటే… మరో టీంలో ఇమ్మూ, సంజన, దివ్య, సుమన్ ఉన్నారు. ఇక ఈ రెండు టీంలకు 5 సెకండ్స్ వీడియోని బట్టి, మూవీని గెస్ చేయాలని చెప్పారు. ఈ టాస్క్ లో సంజన టీమ్ విన్ అయ్యింది.

భరణి బెస్ట్ మూమెంట్

టాస్క్ ఆడుతుండగానే “భరణి లాస్ట్ వీక్ బెస్ట్ మూమెంట్ ఏంటో తెలుసా? చెప్పడం కాదు మీకు చూపిస్తా” అంటూ రీసెంట్ ఎపిసోడ్ లో ఉదయాన్నే భరణి, రీతూ, ఇమ్మూ కలిసి స్టెప్పులేసిన ఫన్నీ వీడియోను ప్లే చేశారు. దీంతో హౌస్ మేట్స్ పడి పడి నవ్వుకున్నారు. ఈ హౌస్ లో ఎవరైతే ఉండడం కరెక్ట్ కాదో, వాళ్ళ ఫోటోను డస్ట్ బిన్ లో పారేసి ఎందుకో చెప్పాలి అని మరో టాస్క్ ఇచ్చారు నాగార్జున. దీంతో మూకుమ్మడిగా సంజనాను టార్గెట్ చేశారు హౌస్ మేట్స్

Advertisement

భరణి, ఈ హౌస్ లో ఎక్కువ మందికి ప్రాబ్లం ఉన్నది సంజనతోనే అంటూ డెమోన్ ఆమె పేరు చెప్పారు. కొన్నిసార్లు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. అవతలి వాళ్ళు ఎటాక్ చేశారు కాబట్టి నేను కూడా చేయాలి అని ఏదేదో చేస్తుంది అని తనూజా సంజన పిక్ ను డస్ట్ బిన్ లో వేసింది. ఆ తర్వాత సుమన్ శెట్టి కూడా అదే పని చేశాడు. కాకపోతే నాకు సపోర్ట్ చేయదు అని రొటీన్ సాకు చెప్పాడు. దీంతో నాగార్జున “నామినేషన్ లో అదే రీజన్, టాస్క్ లో అదే రీజన్, కంటెండర్షిప్ లో ఇదే మాట… ఇప్పటికైనా కొత్త డైలాగ్ వెతుక్కోరా నాన్నా” అని కూల్ గా ఇచ్చిపడేశాడు. కొన్ని కొన్ని సార్లు మన మంచి చెప్పేవాళ్ళ మాట అన్నా వింటే తన గేమ్ చాలా బాగుంటది అని సంజన పిక్ ను పడేశాడు ఇమ్మూ. దీంతో నాగార్జున కొడుకే ఫ్యామిలీ ట్రీ నుంచి తీసేశాడు అంటూ ఇద్దరి మధ్య మంట పెట్టాడు. కళ్యాణ్ సంజన పేరు చెప్పగా, రీతూ – దివ్య ఒకరిపై ఒకరు బాండ్ లేదంటూ సేమ్ రీజన్ చెప్పుకున్నారు. ఆ తర్వాత ఇమ్మూ “సింహరాశి” సినిమాలోని “అమ్మా అమ్మా అని పిలిచి” సాంగ్ ను అమ్మాయి వాయిస్ తో పాడి, అందరి గుండెలు పిండేశాడు.

దివ్య అవుట్

చివరకు పాపులర్ సినిమా క్యారెక్టర్ లను హౌస్ మేట్స్ తో పోల్చే మరో కామెడీ టాస్క్ జరిగింది. అందులో ముందుగా దివ్య ఇప్పుడున్న హౌస్ మేట్ లలో దేశముదురు ఎవరు? అని నాగార్జున అడిగారు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సుమన్ పేరు చెప్పింది. దానికి ఆయన ఇచ్చిన రియాక్షన్ తో అందరూ నవ్వుకున్నారు. అయితే ‘దేశముదురు’ క్యారెక్టర్ లో ఇమ్మూ ఫోటోను ఎడిట్ చేసి ఇచ్చారు. దాన్ని చూసి ఇమ్మూ సైతం అది నేనేనా అంటూ నవ్వుకున్నాడు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ ఎవరు భరణి ? అని అడగ్గా… ఆయన రీతూ, పవన్ ల పేర్లు చెప్పారు. డెమోన్ అస్సలు కాదు సార్ అనగానే… “అంటే నువ్వు వీరుడు కాదా, ఆమె సుందరి కాదా?” అంటూ పంచ్ వేశారు నాగ్. ఈ పోస్టర్ ను తనూజకు అంకితం ఇస్తూ… అతిలోక కాదు అతి చేసే సుందరి అనాలి అంటూ సెటైర్ వేశారు. పవన్ అండ్ రీతూలకు ‘గీతగోవిందం’ ఇచ్చారు. సుమన్ కు ‘బాబు బంగారం’, సంజనకు ‘చంద్రముఖి’, భరణికి ‘హాయ్ నాన్న’, దివ్యకు ‘భాగమతి’, కళ్యాణ్ కు ‘రేసుగుర్రం’ ఇచ్చారు. చివరకు ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది. దివ్య – సుమన్ శెట్టి లీస్ట్ లో ఉండగా, దివ్యను ఎలిమినేట్ చేశారు. దీంతో అందరూ ఎమోషనల్ అయ్యారు.

Advertisement

Read Also : ఇక భరించలేను… బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతానంటూ నాగ్ ను వేడుకున్న సంజన

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×