E-Paper
Advertisement

పోకిరికి 20 ఏళ్లు.. బ్లాక్ బస్టర్ సినిమా ఫస్ట్ ఛాయిస్ మహేష్ కాదా.. బ్యాడ్ లక్ అంటే ఆ హీరోదే?

పోకిరికి 20 ఏళ్లు.. బ్లాక్ బస్టర్ సినిమా ఫస్ట్ ఛాయిస్ మహేష్ కాదా.. బ్యాడ్ లక్ అంటే ఆ హీరోదే?
Advertisement

Pokiri Film: మహేష్ బాబు సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమా ఏదైనా ఉంది అంటే అందరికీ టక్కున పోకిరి సినిమా(Pokiri Movie) గుర్తుకు వస్తుంది. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే మైలురాయిగా నిలిచిందని చెప్పాలి. ఇప్పటికీ ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసిన టీవీలలో ప్రసారం చేసిన ప్రేక్షకులు కళ్లార్పకుండా చూస్తారు. అంత క్రేజ్ ఈ సినిమాకు ఉందని చెప్పాలి. ఈ సినిమా సరిగా 20 సంవత్సరాల క్రితం అంటే 2006 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని మొట్టమొదటి 50 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమాగా పోకిరి రికార్డులను సృష్టించింది. అప్పట్లో 200 సెంటర్లలో వంద రోజులకు పైగా పోకిరి ఆడిందని చెప్పాలి.

రవితేజ మొదటి ఎంపికనా..

మహేష్ బాబు కెరియర్ లోనే ఓ మైలురాయిగా నిలిచిన ఈ సినిమాకు నేటికీ సరిగ్గా 20 సంవత్సరాలు కావడంతో అభిమానులు చిత్ర బృందం మరోసారి పోకిరి సినిమాని గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయ్యి 20 సంవత్సరాల పూర్తి చేసుకున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ సినిమా మొదటి ఛాయిస్ మహేష్ బాబు (Mahesh Babu)కాదట. ఈ విషయం తెలిసిన మహేష్ బాబు అభిమానులు షాక్ అవుతున్నారు. మరి పోకిరి సినిమా ఫస్ట్ ఛాయిస్ ఎవరు? ఎవరు వద్దనుకుంటే మహేష్ బాబు చేశారనే విషయానికి వస్తే..

ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య..

Advertisement

పోకిరి సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ ఈ సినిమా కథ రాసుకొనేటప్పుడు మహేష్ బాబుని కాకుండా రవితేజ(Raviteja)ను ఊహించుకొని ఈ కథ రాసారట. స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఈ సినిమా స్టోరీ రవితేజకు వినిపించడంతో కొన్ని కారణాలవల్ల రవితేజ ఈ సినిమాని రిజెక్ట్ చేశారట దీంతో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా ఈ సినిమాకు ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య అనే టైటిల్ పెట్టాలని పూరి భావించారట. ఎప్పుడైతే రవితేజ ఈ సినిమాని రిజెక్ట్ చేశారో ఆ తర్వాత మహేష్ బాబు కోసం ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి ఈ సినిమాకు పోకిరి అని చివరిలో టైటిల్ పెట్టినట్లు తెలియజేశారు.

రిజెక్ట్ చేసిన ఇద్దరు హీరోయిన్లు…

Advertisement

ఇలా రవితేజ ఇలాంటి సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్నారని విషయం తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అలాగే హీరోయిన్ గా ఇలియానా కూడా మొదటి ఎంపిక కాదని,ఈమె కంటే ముందుగా ఇద్దరు హీరోయిన్లు ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇలియానా కంటే ముందుగా ఆయేషా టాకియాను సంప్రదించగా ఈమె ఈ సినిమాకు ఓకే చెప్పి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారని తెలుస్తోంది .ఈయన తర్వాత కంగనా రౌనత్ ను ఎంపిక చేశారు ఈమె కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఇలియానా ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు ఇలియానా జంటగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది.

Also Read: రెండో ప్రెగ్నెన్సీ ప్రకటన తరువాత మొదటిసారి బేబీ బంప్ తో  దీపికా పదుకొనే..వీడియో వైరల్!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×