E-Paper
Advertisement

లెనోవో ఐడియా ట్యాబ్ ప్రోజెన్ 2.. 10,200mAh బ్యాటరీ, రూ.3 వేల వరకు ఆఫర్

లెనోవో ఐడియా ట్యాబ్ ప్రోజెన్ 2..  10,200mAh బ్యాటరీ, రూ.3 వేల వరకు ఆఫర్
Advertisement

Lenovo Idea Tab : లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో జెన్ 2 భారత్ లో రిలీజ్ అయింది. లెనోవో ఆండ్రాయిడ్ టాబ్లెట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆన్-డివైస్ AI ఫీచర్లు, 13 అంగుళాల 3.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో నాలుగు JBL స్పీకర్లు ఉన్నాయి. 8GB RAM, 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో లభిస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 13-అంగుళాల 3.5K డిస్‌ప్లే, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో నాలుగు JBL స్పీకర్లు ఉన్నాయి.

లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో జెన్ 2 కాస్ట్, ఫీచర్స్

లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో జెన్ 2 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 39,999 ధరతో లభిస్తుంది. మే 1 నుంచి Lenovo.com, ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు, రిటైల్ స్టోర్‌లలో సేల్స్ స్టార్ట్ అవుతాయి. లాంచింగ్ ఆఫర్ గా రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్‌ను ఇస్తుంది. అలాగే ఈ టాబ్లెట్‌కు వన్ ఇయర్ వారంటీని అందిస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 16 పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 18 వరకు రెండు OS అప్‌గ్రేడ్‌లు, 2030 వరకు నాలుగేళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లు ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, AI నోట్స్, స్మార్ట్ రీడర్, AI క్రియేషన్ టూల్స్, లైవ్ ట్రాన్స్‌క్రిప్ట్ వంటి అనేక AI-ఫీచర్లు ఉన్నాయి. ఇందులో సర్కిల్ టు సెర్చ్, గూగుల్ జెమిని, రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: యూత్ ఫేవరెట్ స్మార్ట్‌వాచ్‌లు.. రూ. 2 వేల లోపే ఇన్ని మంచి ఫీచర్లా ? బాబోయ్..

కెమెరా ఫీచర్లు

లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో జెన్ 2 బ్యాక్ సైడ్ ఆటోఫోకస్‌తో 13 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ ఫిక్స్‌డ్ ఫోకస్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. USB టైప్-సి పోర్ట్, Wi-Fi 7, బ్లూటూత్ 6 కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. లెనోవో ఐడియా ట్యాబ్ ప్రో జెన్ 2 లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 10,200mAh బ్యాటరీ ఉంటుంది. ఈ టాబ్లెట్ బరువు 598 గ్రాములుగా ఉంది.

Related News

వాట్సాప్‌లో అదిరిపోయే ప్రైవసీ ఫీచర్.. ఇంతకీ’రెస్ట్రిక్టెడ్ చాట్’ అంటే ఏంటీ?

ఆన్ లైన్ షాపింగ్ చేయకపోయినా పార్శిల్ వచ్చిందా? ఇలా చేస్తే..నిలువునా మోసపోతారు!

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

Big Stories

Advertisement
×