E-Paper
Advertisement

రెండో ప్రెగ్నెన్సీ ప్రకటన తరువాత మొదటిసారి బేబీ బంప్ తో  దీపికా పదుకొనే..వీడియో వైరల్!

రెండో ప్రెగ్నెన్సీ ప్రకటన తరువాత మొదటిసారి బేబీ బంప్ తో  దీపికా పదుకొనే..వీడియో వైరల్!
Advertisement

Deepika Padukone: దీపికా పదుకొనే ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయ్యి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తున్న ఈమె తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇప్పటికే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పడుకొనే(Deepika Padukone), త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె తన రెండో ప్రెగ్నెన్సీని(Second pregnancy) ప్రకటించారు. ఇలా ఈమె మరోసారి తల్లి కాబోతున్నారని విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండో ప్రెగ్నెన్సీ ప్రకటన తరువాత దీపిక బయట ఎక్కడ కనిపించలేదు కానీ మొదటిసారి ఈమె కెమెరా కంటికి చిక్కారు.

దీపిక పట్ల శ్రద్ధ వహిస్తున్న రణవీర్..

తాజాగా ఈమె తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె మొదటిసారి బయటకు రావడంతో ఈమె బేబీ బంప్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అదే విధంగా తన భర్త రణ వీర్ సింగ్ తన భార్య పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తూ తనని జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. ఇలా దీపికా పట్ల రణవీర్ చూపిస్తున్నటువంటి కేరింగ్ చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు.

మొదటి సంతానంలో అమ్మాయి..

Advertisement

గత కొద్ది రోజుల క్రితమే దీపికా పదుకొనే తన పెద్ద కుమార్తె దువా చేతికి ప్రేగ్నెన్సీ కిట్ ఇచ్చి ముగ్గురం నలుగురు కాబోతున్నాము అంటూ ఈమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేశారు.. ఇలా ప్రెగ్నెన్సీ ప్రకటించిన తర్వాత మొదటిసారి దీపిక బయటకు రావడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 2018లో తన ప్రేమించిన వ్యక్తి రణవీర్(Ranveer Singh) ను ఇటలీలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న దీపిక 2024వ సంవత్సరంలో మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఏడాది మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇలా ఒకవైపు తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడుపుతున్న ఈమె కెరియర్ పరంగా కూడా బిజీగా ఉన్నారు.

Advertisement

దీపిక పదుకొనే ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలకు కూడా కమిట్ అవుతున్నారు ఈమె అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న రాకా(Raaka) సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ నటుడు షారుఖాన్ తో కలిసి కింగ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. మరోవైపు రణవీర్ సింగ్ ఇటీవల ధురంధర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇటీవల ఈ సినిమా రెండో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా 1750 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

Also Read: పుట్టినరోజు వేళ సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఎదుగుదలను అడ్డుకోలేదంటూ!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×