Ibomma : కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజే కొన్ని ఫైరసి వెబ్ సైట్స్ హెచ్డి క్వాలిటీ లో ఉన్న ప్రింట్ ని ఆన్లైన్లో లీక్ చేస్తున్నారు.. కొన్ని పైరసీ వెబ్ సైట్లు సినిమాలను పైరసీ చేస్తూ వస్తున్నాయి. వీటివల్ల సినిమాకు నష్టం వాటిలే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ పైరసీ నీ అరికట్టేందుకు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. వీటిపై అనేక చర్చలు జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఫిలిం ఛాంబర్ పెద్దలు మరియు సినీ నిర్మాతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రముఖ ఫైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఆయన ఇండియాలో లేడు. నిన్న ప్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవిని కూకట్ పల్లి సీపీఏస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అకౌంట్ లో ఉన్న దాదాపు రూ. 3 కోట్ల డబ్బుల కూడా పోలీసులు ప్రీజ్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
సినీ ఇండస్ట్రీకి పైరసీ అనేది పెనుభూతం లాగా మారింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చిన స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజే ఆన్లైన్లోకి వచ్చేవి. భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలను కూడా పైరసీ కేటుగాళ్లు సినిమాల HD క్వాలిటీతో ప్రింట్ ను ఆన్ లైన్లో లీక్ చేసేస్తున్నారు. ఈ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా పైరసీకి గురయ్యాయి. సినీ పెద్దలు పైరసీని ఎలాగైనా ఎదుర్కోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ పైరసీ వెబ్ సైట్ అయిన ఐబొమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కొద్దిరోజులుగా పోలీసులు దీని గురించి పూర్తి వివరాలను తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నారు. ఎట్టకేలకు పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ వెబ్ సైట్ ని నిర్వహిస్తున్న వ్యక్తి రవిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రవి గత కొద్ది రోజులుగా హైదరాబాదులో లేరని తెలుసుకున్న పోలీసులు ఆయన ఎప్పుడెప్పుడు వస్తారని వెయిట్ చేస్తున్నారు.. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఆయన భార్యతో గొడవలు కావడంతో ఆయన ఫ్రాన్స్ కు వెళ్ళినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అంతే కాదు రవిని అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే ఆయన కొన్ని సీజ్ చేశారు.
భారీ బడ్జెట్ తో తెరికెక్కించిన సినిమాలన్నీ కూడా థియేటర్లలో రిలీజ్ అయిన మొదటి రోజే హై క్వాలిటీ తో ఐ బొమ్మ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ వచ్చింది.. ఇప్పటికే ఈ వెబ్ సైట్ పై పలుమార్లు టాలీవుడ్ సినీ పెద్దలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే పోలీసులు గత కొద్ది రోజులుగా ఈ వెబ్ సైట్ నిర్వాహకున్ని అరెస్ట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.. మొత్తానికి విదేశాల నుంచి హైదరాబాదులో అడుగుపెట్టిన ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.. ఇది సినీ నిర్మాతలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొత్త సినిమాలకు పైరసీ టెన్షన్ ఉండదని నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రవి అరెస్టు తర్వాత ఆ వెబ్ సైట్ ని మరొకరు ఎవరైన హ్యాండిల్ చేస్తున్నారా..? దీని వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారు అని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఇది నిర్మాతలకి గుడ్ న్యూసే కానీ మూవీ లవర్స్ కి మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. కొత్త సినిమాలను థియేటర్లోకి వెళ్లకుండా ఇంట్లోనే వీక్సించే చాలామందికి ఇది షాకింగ్ న్యూస్.. ఏది ఏమైనా స్టార్ హీరోల అభిమానులు తమ హీరోల సినిమాలు ఇక ఫైరసికి గురయ్యే అవకాశాలు లేవు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.