E-Paper
Advertisement

Top 20 News Today: భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న అగ్ని కీలలు, ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య

Top 20 News Today: భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న అగ్ని కీలలు, ఖమ్మం జిల్లాలో కానిస్టేబుల్ ఆత్మహత్య

1. విశాఖ వేదికగా రెండో రోజు CII పార్టనర్‌షిప్ సమ్మిట్..

విశాఖలో రెండో రోజు సీఐఐ సదస్సు కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు దేశవిదేశాలకు చెందిన ప్రతినిధులు. ఎల్జీ కెమ్, అట్మాస్పియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్‌తో పాటు.. సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ అధిపతులు, ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రేమాండ్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

2. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో హైటెన్షన్

మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో హైటెన్షన్ నెలకొంది. కంకరబోడ్‌లోని స్కూల్లో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సోషల్ టీచర్ రవి.. విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్ కోటయ్య పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

3. విషాదం.. కానిస్టేబుల్ ఆత్మహత్య

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ బాలాజీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదులాపురం మున్సిపల్ పరిధిలోని సింహాద్రి నగర్‌లో తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

4. దారుణ ఘటన.. బట్టలు ఆరేసే క్రమంలో గొడవ.. చివరకి కత్తితో పొడిచి..

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బట్టలు ఆరేసే విషయంలో గొడవపడిన అన్న హరి.. తమ్ముడు అశోక్ కుమార్‌ను కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. క్షతగాత్రుడినిక కుటుంబీకులు జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

5. మంచిర్యాల జిల్లాలో పెరిగిన చలి తీవ్రత..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. పొగ మంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ 19 తర్వాత చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

6. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకున్న AIMIM సంబరాలు..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకున్న తర్వాత AIMIM ఛార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ సంబరాలు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీహార్ అసెంబ్లీ అభ్యర్థికి అభినందనలు తెలిపారు. అన్ని MIM స్థానిక నాయకులు, కార్పొరేటర్లు చార్మినార్‌లో సంబరాలు జరుపుకుంటున్నారు.

7. ప్రకాశం జిల్లాలో కొవ్వొత్తుల ర్యాలీ..

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో హిందూ చైతన్య వేదిక, హిందు సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన బాంబుదాడి ఘటనలో పలువురు మృతి చెందడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాంబు దాడులు మళ్లీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం దాడులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

8. రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని హుగ్గెల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. కార్యాలయం తలుపులు మూసి, సోదాలు చేపట్టారు. 113 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

9. తిరుపతిలో వైభవంగా జరిగిన కార్తీక మహాదీపోత్సవం

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో కార్తీక మహాదీపోత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు హాజరై సామూహిక దీపారాధన చేశారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా పూజలు నిర్వహించారు.

10. ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత

నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్న పిల్లల వార్డులో డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో చిన్నారులకు ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. చిన్నారుల హెల్త్ కండీషన్‌పై తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

11. అమ్మవారి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం..

నెల్లూరు జిల్లా మూలాపేట సమీపంలోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద టెంకాయల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించడంతో దుకాణంలోని వస్తువులతో పాటు నగదు మంటల్లో కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

12. కుప్పకూలిన విమానం..

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపాన శిక్షణ విమానం కూలిపోయింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పిలాటస్‌ పీసీ 7 చిన్న విమానం తాంబరం వైమానిక దళ స్థావరం నుంచి బయల్దేరింది. కొద్ది సేపటికే తిరుప్పోరూర్‌ ఉప్పళం ప్రాంతంలోని ఉప్పు తయారు చేసే పరిశ్రమ వద్ద కూలిపోయింది. అందులోని పైలట్‌ సహా ముగ్గురు పారాచూట్‌ సహాయంతో క్షేమంగా బయటపడ్డారు.

13. ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ, మహాకూటమికి కృతజ్ఞతలు..

బిహార్ ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తూ, మహాకూటమికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని, కార్యకర్తలు నిరుత్సాహపడొద్దని కోరారు. ఎన్నికల ఫలితాలను లోతుగా అధ్యయనం చేసి, త్వరలో వివరణాత్మక ప్రకటన చేస్తామని తెలిపారు.

14. బిహార్‌లో ఓటర్లకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు

మహా కూటమిపై నమ్మకం ఉంచిన బిహార్‌లో ఓటర్లకు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు అన్యాయంగా జరగడంతోనే ఓడిపోయినట్లు చెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పోరాడతామని, కాంగ్రెస్, ఇండియా అలయన్స్ ఫలితాన్ని సమీక్షించి, ప్రజాస్వామ్య రక్షణ ప్రయత్నాలను ముమ్మరం చేస్తామన్నారు.

15.కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం..

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పొద్దార్ కోర్టు సమీపంలోని ఎజ్రా స్ట్రీట్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీప భవనాలకు సైతం మంటలు వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 17 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

16. రంగంలోకి చైనా సిచువాన్..

నీటిపై ఉంటూ నేలపై యుద్ధం చేయగల యుద్ధనౌక సిచువాన్‌ను చైనా ట్రయల్‌ కోసం రంగంలోకి దింపింది. ప్రపంచంలోనే ఎలక్ట్రో మాగ్నెటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంచ్‌ సిస్టం వ్యవస్థ ఉన్న తొలి యుద్ధ నౌక ఇదే కావడం విశేషం. ఇందులో యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లు, డ్రోన్‌లు, సముద్రం నుంచి భూమిపైకి నేరుగా వెళ్లిపోయే వాహనాలను, పెద్ద సంఖ్యలో సైనికులను ఒక చోటు నుంచి మరో చోటుకు చేరవేయవచ్చు.

17. ట్రంప్‌కు బీబీసీ క్షమాపణలు

అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్ధం వచ్చేలా మార్చినందుకు బీబీసీ క్షమాపణలు చెప్పింది. ఆ ప్రసంగాన్ని సవరించినందుకు తాను, బీబీసీ సంస్థ చింతిస్తున్నట్లు ఛైర్మన్ సమీర్ షా శ్వేతసౌధానికి వ్యక్తిగత లేఖ పంపారు. ట్రంప్ డిమాండు చేసిన బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇచ్చేందుకు నిరాకరించినట్లు పేర్కొంది.

18. 2026 ఐపీఎల్ సీజన్‌లో బరిలోకి దిగనున్న మహ్మద్ షమి

2026 ఐపీఎల్ సీజన్‌లో లఖ్నో సూపర్ జెయింట్స్ తరఫున భారత పేసర్ మహ్మద్ షమి బరిలో దిగనున్నాడు. ఆటగాళ్ల బదిలీలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి అతడిని తీసుకునేందుకు లఖ్‌నవూ అంగీకరించిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గత సీజన్‌లో షమి సన్‌రైజర్స్ తరఫున ఆడాడు.

19. గ్లోబ్‌ట్రాటర్‌ వేడుకకి పాసులు లేకుండా రావొద్దు – మహేశ్‌బాబు

గ్లోబ్‌ట్రాటర్‌ వేడుకకి కంగారుపడి పాసులు లేకుండా ఎవ్వరూ రావొద్దని కథానాయకుడు మహేశ్‌బాబు కోరారు. ఆయన కథానాయకుడిగా ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ వేడుకను నిర్వహిస్తున్నారు. అందులో సినిమా పేరుతోపాటు, టీజర్‌ని విడుదల చేయనున్నారు.

20. అఖండ 2లో హిందూ సనాతన ధర్మం శక్తి పరాక్రమాన్ని చూస్తారు-బాలకృష్ణ

హిందూ సనాతన ధర్మం శక్తి పరాక్రమాన్ని అఖండ 2 తాండవంలో చూస్తారన్నారు కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని తీసుకెళ్లి ఈ సినిమా చూపించాలని కోరారు. ఈ సినిమా డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ముంబయిలో ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×