E-Paper
Advertisement

I Bomma Ravi: ఐబొమ్మ రవిని పట్టించింది పెళ్ళాం కాదు… ఫ్రెండ్.. ఆ రోజు అసలేం జరిగిందంటే?

I Bomma Ravi: ఐబొమ్మ రవిని పట్టించింది పెళ్ళాం కాదు… ఫ్రెండ్.. ఆ రోజు అసలేం జరిగిందంటే?
Advertisement

I Bomma Ravi: ఐ బొమ్మ రవి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలను పైరసీ చేస్తూ ఈయన పెద్ద ఎత్తున సొమ్ము చేసుకోవడమే కాకుండా సినిమా ఇండస్ట్రీకి కూడా వేల కోట్ల రూపాయల నష్టాన్ని తీసుకువచ్చారు. ఇలా సినిమాలను పైరసీలకు గురి చేస్తున్న సైట్లపై పోలీసు దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని సైట్లను మూసివేయగా, పైరసీ కింగ్ అయిన ఐ బొమ్మ(IBommae)ను టార్గెట్ చేస్తూ గత కొంతకాలంగా ఐ బొమ్మ నిర్వాహకుడి పై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పోలీసులు ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని(Immadi Ravi) అరెస్టు చేసి జైలుకు పంపించారు.

రవి అరెస్ట్ భార్యకు సంబంధం లేదు..

ఈ విధంగా రవి అరెస్టు కావడంతో ఈయన అరెస్టుకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి. రవి అరెస్టుకు తన భార్య కారణమంటూ వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. రవి తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారని ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలోనే తన భార్య ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు తనని అరెస్టు చేశారంటూ వార్తలు వచ్చాయి.. ఇక ఈ వార్తలను సజ్జనార్ కూడా ఖండించారు. తన భార్య ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పోలీస్ దర్యాప్తులో భాగంగానే ఆయన అరెస్ట్ అయ్యారని తెలిపారు. ఇకపోతే తాజాగా ఐ బొమ్మ రవి అరెస్టు కావడం వెనుక ఎవరి హస్తం ఉందో బయటపడింది.

మెసేజ్ ఆధారంగా దొరికిపోయిన రవి..

Advertisement

ఐ బొమ్మ రవి అరెస్ట్ అవ్వడానికి తన భార్య ఏమాత్రం కారణం కాదని తెలుస్తోంది. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవి తన స్నేహితుడిని తన ఫ్లాట్ కు రమ్మని మెసేజ్ చేశారు. అప్పటికే పోలీసులు తన స్నేహితుడి నెంబర్ ను సంపాదించి ట్రేస్ చేసారు. ఈ మెసేజ్ ఆధారంగా పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆయన చేసిన మెసేజ్ ద్వారానే పోలీసులకు దొరికిపోయారని చెప్పాలి. ఇక రవికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు .నేటితో ఆయన కస్టడీ పూర్తి కావడంతో మరోసారి పోలీసులు తనని కోర్టుకు తీసుకువెళ్లనున్నారు.

రవికి బెయిల్ వస్తుందా?

Advertisement

ఇలా రిమాండ్ లో ఉన్నటువంటి రవిని విచారణ కోరుతూ పోలీసులు కోర్టు అనుమతి తీసుకున్నారు అయితే ఈ విచారణలో భాగంగా రవి నుంచి ఏ విధమైనటువంటి పూర్తి సమాచారం రాకపోవడంతో పోలీసులు మరోసారి రవికి కస్టడీ విధించాలని కోరుతున్నారు. మరి మూవీ పైరసీ కేసులో భాగంగా రవికి బెయిల్ వస్తుందా? లేదంటే ఈయన రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు తీర్పు వెల్లడిస్తుందా ? అనేది తెలియాల్సి ఉంది. ఇక రవి అరెస్టు కావడంతో సోషల్ మీడియా వేదికగా ఈయనకు పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా నిర్మించడం కోసం వేలకోట్లు ఖర్చు చేస్తూ ఆ భారాన్ని మొత్తం ప్రజలపై వేస్తున్నారని అందుకే రవి లాంటి వారు పుట్టుకొచ్చారు అంటూ రవికి పెద్ద ఎత్తున మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: Swayambhu Release: నిఖిల్ స్వయంభు రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా 8 భాషలలో?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×