E-Paper

విజయ్ సీఎం అవుతాడని ముందే చెప్పేసిన పూజా హెగ్డే? ఇదిగో వీడియో!

విజయ్ సీఎం అవుతాడని ముందే చెప్పేసిన పూజా హెగ్డే? ఇదిగో వీడియో!
Advertisement

Pooja Hegde: పూజా హెగ్డే సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒకానొక సమయంలో ఓవెలుగు వెలిగారు. అయితే ఇటీవల ఈమెకు సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు. కానీ ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా  బిజీ అవుతున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో విజయ్ (Vijay) అద్భుతమైన విజయాన్ని సాధించిన నేపథ్యంలో పూజా హెగ్డే(Pooja Hegde) కూడా సోషల్ మీడియా వేదికగా విజయ్ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.

విజయ్ సీఎం అని చెప్పిన పూజ..

తాజాగా పూజా హెగ్డే ఇంస్టాగ్రామ్ వేదికగా మరొక వీడియోను షేర్ చేశారు. అయితే ఈ వీడియో వీరిద్దరూ కలిసి నటించిన జననాయగన్ సినిమా షూటింగ్ సమయంలోనిదని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సరదాగా విజయ్ పూజా తీసుకున్న వీడియో అని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎలక్షన్లలో ఎవరు విన్ అవుతారనే ప్రశ్న బోర్డుపై రాసి ఉండడంతో పూజా విజయ్ వద్దకు వెళ్లి ఎన్నికలలో గెలిచేది విజయ్ అంటూ చెప్పుకుచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోను షేర్ చేసిన పూజ హెగ్డే విజయ్ సార్ సీఎం అవుతారని తాను ముందే ఊహించాను, మీ కలలు నిజం కావాలి విజయ్ సర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

సంచలనంగా మారిన కారు నెంబర్..

Advertisement

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విజయ్ ఎన్నికలలో గెలిచి సీఎం అవుతారని పూజా హెగ్డే అప్పుడే గెస్ చేశారా? అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది అభిమానులు అభినందనలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా విజయ్ హీరోగా నటించిన గోట్ (Goat) సినిమాలోని కారు నెంబర్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

గోట్ సినిమాలో విజయ్ వాడిన కారుకు TN 07CM 2026 అనే నెంబర్ ప్లేట్ ఉండటం గమనార్హం. ఇలా విజయ్ 2026 లో సీఎం అవుతారని ప్రకృతి కూడా ముందే పసిగట్టిందా? అందుకే ఈయన నటించిన సినిమాలోని కారుకు CM 2026 నెంబర్ ప్లేట్ వచ్చిందా అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా విజయ్ తమిళనాడు ఎన్నికలలో ప్రభంజనం సృష్టించారని చెప్పాలి. పార్టీ పెట్టిన కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో సింగిల్ గా పోటీ చేసి విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. అయితే విజయ్ మాత్రం అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తూ ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని తమిళనాడు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం అందుకోబోతున్నారు. ఇక విజయ్ ముఖ్యమంత్రి కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ హీరోగా ఈయనని వెండి తెరపై చూడలేమనే నిరాశ మాత్రం వ్యక్తం చేస్తున్నారు.. ఇక విజయ్ చివరిగా పూజ హెగ్డేతో కలిసి నటించిన జన నాయగన్(Jananayagan) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇది విజయ్ ఆఖరి సినిమా కావటం విశేషం.

Also Read: సమంత మా ఇంటి బంగారం వాయిదా.. మే నెలలో కళ తప్పిన థియేటర్లు..

Related News

నాగ్ ‘KING 100’ నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్.. రంగంలోకి దిగిన కన్నడ రియల్ స్టార్

బాహుబలి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదుగా.. ఫ్రాన్స్‌లో ప్రభాస్ యానిమేషన్ సినిమా సెన్సేషన్!

NTR 31.. ‘డ్రాగన్’ లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్.. ప్రశాంత్ నీల్ ఆ రిస్క్ దాటుతాడా?

కృతి శెట్టితో శంకర్ కొడుకు రొమాన్స్.. ‘లవర్ బాయ్’గా అర్జిత్ గ్రాండ్ ఎంట్రీ!

మణికొండ మొత్తం కొనేసేవాడిని.. ఓవర్ కాన్ఫిడెన్స్ ముంచేసింది.. ‘చిత్రం’ శ్రీను షాకింగ్ కామెంట్స్!

షాకింగ్ సర్ప్రైజ్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘స్పైడర్‌మ్యాన్’ కపుల్!

సెక్యూరిటీలో ‘మహిళా బౌన్సర్’.. తలపతి విజయ్ క్రేజీ డెసిషన్ వైరల్

మెగాస్టార్ 158 సెట్స్ లోకి ఎంట్రీ.. భారీ అంచనాలు, అంతకుమించిన అనుమానాలు!

×