E-Paper
Advertisement

సోషల్ మీడియా రీల్స్ పిచ్చి.. ఉమ్మెత్త పువ్వు కూర వండుకుని తిన్న కుటుంబం.. పరిస్థితి విషమం

సోషల్ మీడియా రీల్స్ పిచ్చి.. ఉమ్మెత్త పువ్వు కూర వండుకుని తిన్న కుటుంబం.. పరిస్థితి విషమం
Advertisement

Kakinada News: సోషల్‌ మీడియాలో వచ్చే రీల్స్‌ను గుడ్డిగా నమ్మడం ఒక కుటుంబం ప్రాణాల మీదకు తెచ్చింది. కాకినాడ జిల్లా ఎర్రంపాలెం గ్రామంలో సోమవారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉమ్మెత్త పువ్వు కూర తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా వేదికల్లో వచ్చే వీడియోలను చూసి, అవగాహన లేకుండా విషపూరితమైన మొక్కలను ఆహారంగా తీసుకోవడం ఈ ప్రమాదానికి దారితీసింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్న ఈ కుటుంబం, స్థానిక అమ్మవారి జాతర ఉత్సవాల కోసం తమ సొంత ఊరైన ఎర్రంపాలెంకు వచ్చారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో వచ్చే వంటకాల వీడియోలను చూస్తున్న వీరికి ఉమ్మెత్త పువ్వుకు సంబంధించిన ఒక వీడియో కనిపించింది. సాధారణ ఆకుకూరల మాదిరిగానే ఉమ్మెత్త పువ్వు కూర కూడా శరీరానికి ఎంతో బలమని ఆ వీడియోలో చెప్పడంతో వారు అది నిజమని నమ్మారు. వెంటనే ఉమ్మెత్త పువ్వులను సేకరించి పప్పుతో కలిపి కూర వండుకుని తిన్నారు.

Advertisement

ఆహారం తిన్న కొద్దిసేపటికే కుటుంబ సభ్యులైన గంగా భవాని, వీరలక్ష్మి, వీరబాబు, జయలక్ష్మి ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. పరిస్థితి గమనించిన స్థానికులు వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి నలుగురి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పెట్టే ఇలాంటి అశాస్త్రీయ వీడియోలు ఎంతటి ప్రమాదాలకు కారణమవుతున్నాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

ఉమ్మెత్త పువ్వులో అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పదార్థాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన విరుగుడు (Antidote) ఉండదని, శరీరంలో పాయిజన్ శాతం పెరిగితే ప్రాణాపాయం తప్పదని వారు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే చిట్కాలను లేదా కొత్త రకం వంటకాలను ప్రయత్నించే ముందు వాటి గురించి పూర్తి స్థాయిలో ఆరా తీయాలని, లేదంటే ఇలాంటి ప్రాణాంతక పరిస్థితులు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Read Also: క్రూయిజ్ షిప్‌లో ‘హంటా వైరస్’ అలజడి.. ముగ్గురు మృతి, నడి సంద్రంలో నరకం!

Tags

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×