E-Paper
Advertisement

Nani – Sujith: తెరపైకి ఫ్రెష్ జోడి.. నాని సరసన స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

Nani – Sujith: తెరపైకి ఫ్రెష్ జోడి.. నాని సరసన స్టార్ హీరోయిన్.. ఎవరంటే?
Advertisement

Nani – Sujith: ఈమధ్యకాలంలో రిపీట్ జోడీలను తెరపై చూడడానికి అభిమానులు ఆసక్తి కనబరచడం లేదు. అందుకే ఫ్రెష్ జోడీలతో సరికొత్త కథ కథాంశంతో ప్రేక్షకులను అలరించడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త ఫ్రెష్ జోడి తెరపైకి రాబోతోంది. అందులో భాగంగానే నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒకవైపు హీరో గానే కాకుండా మరొకవైపు నిర్మాతగా కూడా పలు చిత్రాలు నిర్మిస్తూ బిజీగా మారిన విషయం తెలిసిందే. అలాంటి ఈయన తాజాగా ‘ఓజీ’ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సుజీత్ తో కలిసి ఒక భారీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

తెరపైకి ఫ్రెష్ జోడి..

ముఖ్యంగా ఈ బడా ప్రాజెక్టు నుంచి ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందా అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూస్తుండగా ..ఇప్పుడు ఎవరు ఊహించని ఒక న్యూస్ తెరపైకి రావడంతో కొంతమంది సంతోషం వ్యక్తం చేసినా ..మరికొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ ఏడాది జూన్ నుంచి మొదలు కాబోతుందట. ఇప్పటికే అదిరిపోయే స్క్రిప్టు రెడీ చేసిన సుజిత్ ఈ సినిమాలో ఇప్పటివరకు మనం నానిని చూడని విధంగా ఒక సరికొత్త స్టైలిష్ లుక్ తో పవర్ఫుల్ యాక్షన్ పాత్రలో నానిని చూపించబోతున్నట్లు సమాచారం.

నాని కోసం సుజిత్ పక్కా ప్రణాళిక..

Advertisement

ఇకపోతే ఈ సినిమా నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం.. ఇందులో నాని సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. పైగా నాని , పూజా హెగ్డే కలిసి నటిస్తున్న తొలి మూవీ కూడా ఇదే కావడంతో వీరిద్దరి జోడి ను స్క్రీన్ పై చూడడానికి అభిమానులు ఆసక్తి కనబరిస్తున్నారు. పైగా ఈ సినిమా కోసం సుజీత్ సమయం తీసుకుని విజువల్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా ఇందులో పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలు నాని అభిమానులలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

also read:Allu Sirish: ‘మగజాతి ఆణిముత్యం’గా అల్లు శిరీష్.. ఈసారైనా హిట్ కొడతాడా

హీరోయిన్ విషయంలో అనుమానాలు..

Advertisement

ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సూర్య రెట్రో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. నిజానికి ఇందులో మోనిక అనే స్పెషల్ సాంగ్ చేసి అందరినీ ఆకట్టుకుంది పూజ హెగ్డే. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఈమెకు క్రేజ్ లభించలేదు. కానీ ఇప్పుడు విజయ్ సరసన జననాయగన్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇలా ఎప్పటికప్పుడు వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న పూజ హెగ్డే కి నాని సరసన అవకాశం లభించడంతో ఈ జోడి తెరపై హిట్ అవుతుందా? ఐరన్ లెగ్ గా పేరు దక్కించుకున్న పూజ హెగ్డే కి ఈ సినిమా గోల్డెన్ లెగ్ గా మారుతుందా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది పోయి పోయి పూజ హెగ్డేను ఎంపిక చేసుకోవడం ఏంటి ? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related News

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

హైదరాబాద్‌లో ‘ఒడిస్సీ’ మూవీని ఎంజాయ్ చేయడానికి పెర్ఫెక్ట్ థియేటర్లు ఇవే, స్క్రీన్.. సౌండ్ అదుర్స్!

సెన్సార్ పూర్తి చేసుకున్న నయనతార ‘హాయ్’.. రిలీజ్ డేట్ లాక్!

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

Big Stories

Advertisement
×