E-Paper
Advertisement

Father kills Daughter: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. కన్నకూతురిని చంపిన ఓ కిరాతక తండ్రి

Father kills Daughter: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు.. కన్నకూతురిని చంపిన ఓ కిరాతక తండ్రి
Advertisement

Father kills Daughter: స్వేఛ్చ బ్యూరో: ప్రజల్లో నానాటికి అధికార వ్యామోహం పెరిగిపోతోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు చివరికి కన్న కూతురినే హతమార్చాడు ఓ కిరాతక తండ్రి. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు శివారులోని కెనాల్​లో దొరికిక బాలిక మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ సాయిచైతన్య వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే..

ఎడపల్లి​ మండలంలోని ఏఆర్పీ క్యాంపు శివారులోని నిజాంసాగర్​ డీ 46 కెనాల్​లో ఇటీవల ఓ బాలిక మృతదేహం దొరికింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఏసీపీ శ్రీనివాస్(ACP Srinivas)​ ఆధ్వర్యంలో మూడు టీంలు నిందితుల కోసం దర్యాప్తు చేపట్టారు. బాలికను మహారాష్ట్రలోని ముఖేడ్​కు చెందిన ప్రాచి కొండమంగలేగా గుర్తించారు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి వివరాలు సేకరించారు. బాలికను కన్న తండ్రే హతమార్చినట్లు గుర్తించారు. ముఖేడ్​ తాలూకాలోని కెరుర్​ గ్రామానికి చెందిన కొండమంగలే పాండురంగ సెలూన్ నడుపుతూ భార్య ముగ్గురు పిల్లలతో ముఖేడ్​లో జీవిస్తున్నాడు. అయితే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కెరుర్ సర్పంచ్​గా పోటీ చేయాలనే భావించాడు. అయితే ముగ్గురు పిల్లలు ఉండడంతో పోటీకి అనర్హుడిని అవుతానని అనుకున్నాడు. దీంతో ప్రస్తుత సర్పంచ్ షిండే గణేశ్​తో కలిసి పథకం వేశారు. ముగ్గురు పిల్లల్లో బాబుని ఎవరికైనా దత్తత ఇవ్వాలని అనుకున్నారు.

Advertisement

Also Read: Tata Motors Sales: జనవరిలో దుమ్మురేపిన టాటా మోటర్స్, అమ్మో.. ఒకే నెలలో అన్ని కార్లు అమ్మిందా?

ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి..

కానీ అప్పటికే అతని పేరు మీద బర్త్ సర్టిఫికెట్ ఉందని నిర్ధారించుకున్నారు. దీనికి గాను పుణె కార్పొరేషన్ ఆఫీసు వెళ్లి బర్త్ సర్టిఫికెట్​ మార్చాలని ప్రయత్నం చేశారు. కానీ బర్త్ సర్టిఫికెట్​ మారదని తెలిసిన తరువాత.. ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్లు ప్రచారం చేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగా పెద్ద కూతురు ప్రాచీని అతని తండ్రి తన బైక్​పై ఎక్కించుకుని వచ్చి నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లి​ మండలంలోని ఏఆర్పీ క్యాంపు శివారులోని నిజాంసాగర్​ డీ 46 కెనాల్​లో బాలికను తోసేశాడు. దీంతో చిన్నారి మృతి చెందింది. కేసును చాకచక్యంగా ఛేదించిన బోధన్​ రూరల్​ సీఐ విజయ్​బాబు, ఎస్సైలు రమ, చంద్రమోహన్​, ఏఎస్సై బాబురావు, కానిస్టేబుళ్లు సుధీర్​, శ్రీకాంత్​లను సీపీ అభినందించారు.

Advertisement

Also Read: Apple Valentine’s Day Offers: వాలెంటైన్స్ డే అదిరిపోయే ఆఫర్స్.. ఐఫోన్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్‌పై వేలల్లో డిస్కౌంట్లు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×