E-Paper
Advertisement

ఫ్యాన్స్ కు షాకిచ్చిన బుట్టబొమ్మ..సీక్రెట్ గా ఎంగేజ్మెంట్..?

ఫ్యాన్స్ కు షాకిచ్చిన బుట్టబొమ్మ..సీక్రెట్ గా ఎంగేజ్మెంట్..?
Advertisement

Pooja Hegde : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ఈమధ్య ఐరన్ లెగ్గు హీరోయిన్గా మారిపోయింది. ఈమధ్య ఈమె చేసిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో పూజా హెగ్డే నీ స్టార్ హీరోలు పక్కన పెట్టారని తెలుస్తుంది.. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ మళ్ళీ బిజీ అవుతుంది బుట్ట బొమ్మ.. హిందీలో వరుణ్ ధావన్ సరసన నటించిన ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ మే 22న థియేటర్లలోకి రానుంది.. సినిమాల సంగతి పక్కన పెడితే ఈమె ఈమధ్య తన బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు తాజాగా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. నిజంగానే ఈ అమ్మడు ఎంగేజ్మెంట్ చేసుకుందా లేదా అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం…

సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్..

క్రేజీ హీరోయిన్ పూజ హెగ్డే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. గత రెండేళ్లుగా ఈమె కథలో సూపర్ హిట్ సినిమాలు అయితే పడలేదు. అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది బుట్ట బొమ్మ.. ఈమె ఈ ఏడాది నటించిన రెండు సినిమాలు కూడా థియేటర్లలోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే ఈమె ఓ నటుడుతో ప్రేమాయణం నడుపుతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కెమెరాలకు చిక్కింది. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈమె పూజ హెగ్డే బాయ్ ఫ్రెండ్ అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది అంటూ మరో వార్త నెట్టింట ప్రచారంలో ఉంది.. తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేసింది.. అయితే అందులో ఆమె చేతికి ఒక రింగు కనిపించడంతో సీక్రెట్ గా బుట్ట బొమ్మ ఎంగేజ్మెంట్ చేసుకుంది అని వార్తలు వైరల్ అవుతున్నాయి.. మరి నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందాం లేదా అన్నది క్లారిటీ రాలేదు..

రోహన్ మెహ్ర తో పూజా లవ్.. 

Advertisement

పూజా హెగ్డే బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రా తో ఒక్క సినిమా కూడా తీయలేదు.. కామన్ ఫ్రెండ్స్‌ ద్వారా ఇద్దరికీ పరిచయం అయ్యింది. పైగా ఇద్దరూ ఉండేది ముంబైలోనే.. వీళ్ళిద్దరూ కలిసి బయట రెస్టారెంట్లకి అలాగే ఫంక్షన్లకి వెళ్లడం బాలీవుడ్ జనాల దృష్టిలో పడ్డారు.. ఎక్కడ చూసినా కూడా వీరిద్దరూ కనిపించడంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అని అనుమానం కూడా అందరికీ వస్తుంది. మరి ఈమె అతనితో ప్రేమాయణం నడుపుతుందా లేదా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.. ఈమధ్య రష్మిక మందన్న విజయ్ దేవరకొండ తో పెళ్లి పీటలు ఎక్కే వరకు ఆ విషయాన్ని బయట పెట్టలేదు.. అలాగే పూజ హెగ్డే కూడా బయట పెట్టదేమో చూడాలి..

Advertisement

పూజాహెగ్డే సినిమాల విషయానికోస్తే.. వరుణ్ ధావన్ సరసన నటించిన ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ మే 22న థియేటర్లలోకి రానుంది.. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది.. తమిళంలో దళపతి విజయ్ సరసన ‘జన నాయగన్’ సినిమాలో నటించారు. అది త్వరలో విడుదల కానుంది.. వీటితో పాటుగా మరో రెండు భారీ ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు తెలుస్తుంది..

Related News

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

లక్కీ భాస్కర్ 2… వెంకీ అట్లూరి బిగ్ అప్డేట్!

Big Stories

Advertisement
×