E-Paper
Advertisement

Hyderabad Metro 2 Phase: హైదరాబాద్ మెట్రో -2 ఫేజ్.. ఆపై కేంద్రం గ్రీన్‌సిగ్నల్

Hyderabad Metro 2 Phase:  హైదరాబాద్ మెట్రో -2 ఫేజ్.. ఆపై కేంద్రం గ్రీన్‌సిగ్నల్
Advertisement

Hyderabad Metro 2 Phase: హైదరాబాద్ మెట్రో-2 ఫేజ్ విషయంలో దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రప్రభుత్వం. రెండో దశకు సూత్రప్రాయంగా అంగీకరించింది. దానికి సంబంధించి డీపీఆర్ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి ఖట్టర్ చెప్పినట్టు మరొక మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. అయితే కేంద్ర-రాష్ట్రాలు చెరో సగం ఖర్చుతో ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపింది.

హైదరాబాద్ మెట్రో రెండో దశ.. ఆపై కేంద్రం గ్రీన్‌సిగ్నల్

Advertisement

బుధవారం ఢిల్లీలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో మంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని కీలక అభివృద్ధి ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. హైదరాబాద్ మెట్రో రెండ దశకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తుందని చెప్పినట్టు వెల్లడించారు.

అయితే కేంద్ర-రాష్ట్రాలు చెరో సగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. 162 కి.మీ మెట్రో రెండో దశ విస్తరణకు ప్రతిపాదనలు వచ్చాయని వివరించారు. వాటిని కేంద్రం పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్ చెప్పారు. దాదాపు రూ. 38,595 కోట్లు ఖర్చు అవుతుందని ఓ అంచనా. గురువారం జరగనున్న కేంద్ర కేబినెట్‌లో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

దాదాపు రూ. 38,595 కోట్లు ఖర్చు అవుతుందని ఓ అంచనా

ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి మొదటి దశ ప్రాజెక్టును టేకోవర్‌ చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. మెట్రో రెండో దశ విషయంలో కేంద్రానికి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినట్టు వెల్లడించారు. అయితే కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 50-50 నిష్పత్తిలో ఖర్చు చేసే విషయంలో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉందన్నారు.

ఇక మూసీ నదికి సంబంధించి మురుగు నీటిని శుద్ధిచేసేందుకు రూ.3,975 కోట్ల విలువైన మొత్తం 39 శుద్ధి ప్లాంట్లను మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం రోజుకు 972 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేసే సామర్థ్యం ఉందన్నారు.

ALSO READ: శాంతి భద్రతలపై అలసత్వం.. పోలీసుశాఖలో అవినీతి ఏమాత్రం సహించను-సీఎం రేవంత్‌రెడ్డి

మూసీ నది పరిరక్షణ, సిటీ పారిశుద్ధ్య మెరుగుదలకు ఎంతో దోహదపడుతుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ నగరాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు పూర్తిస్థాయిలో కేంద్రం సహకారం అందిస్తోందని ఖట్టర్‌ తనతో అన్నట్లు కిషన్‌రెడ్డి తెలియజేశారు.

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×