E-Paper
Advertisement

Poonam Controversy: ‘రియల్ సింగ్’ vs ‘ఫేక్ సింగ్’..! టార్గెట్ పవన్ కళ్యాణేనా?

Poonam Controversy: ‘రియల్ సింగ్’ vs ‘ఫేక్ సింగ్’..! టార్గెట్ పవన్ కళ్యాణేనా?
Advertisement

Poonam Controversy: టాలీవుడ్ ‘కాంట్రవర్సీ క్వీన్’ పూనమ్ కౌర్ మళ్ళీ బాంబు పేల్చింది! తన ఇన్‌స్టా స్టోరీస్‌తో ఎప్పుడూ హడావిడి చేసే పూనమ్, ఈసారి ఏకంగా ‘సిక్కు’ గెటప్ రాజకీయాన్ని టార్గెట్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను పరోక్షంగా ఏకిపారేసిందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో తెగ సర్క్యులేట్ అవుతుంది .

రియల్ సింగ్ వర్సెస్ ఫేక్ సింగ్.. పూనమ్ పదునైన బాణం!

బాలీవుడ్ సెన్సేషన్ రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ రికార్డులు కొల్లగొడుతుంటే, పూనమ్ మాత్రం ఆ సినిమాలో రణ్‌వీర్ పోషించిన జస్క్రిత్ సింగ్ రంగీ పాత్రను ఆకాశానికెత్తేస్తూ తన ఇన్‌స్టా స్టోరీలో ఒక పదునైన బాణం వదిలింది. “ది రియల్ సింగ్.. స్టోరీ ఆఫ్ రియల్ హీరో. ధురంధర్ 2 సినిమా కోసం నేను పరిగెత్తుకుంటూ వెళ్లాను” అని రాస్తూనే, చివర్లో “ఏ ఫేక్ సింగ్ కూడా ఈ బాక్సాఫీస్ ముందు నిలబడలేరు” అంటూ చేసిన కామెంట్స్   ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయ్.

టార్గెట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవన్ గెటప్‌పై సెటైర్లు?

Advertisement

అయితే ఈ కామెంట్స్ నేరుగా పవన్ కళ్యాణ్‌కే గుచ్చుకున్నాయని  మండిపడుతున్నారు మెగా అభిమానులు. ఎందుకంటే ఆ మధ్య పవన్ సిక్కు గెటప్ లో కనిపించడం పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇపుడు దురంధర్ 2 రిలీజ్ అయిన రోజే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలోకి రావడంతో పూనం కావాలనే ఈ కామెంట్స్ వదిలిందన్నది వారి వాదన . పూనమ్ స్వతహాగా సిక్కు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో, కేవలం సినిమా పబ్లిసిటీ కోసం పవన్ ఆ గెటప్ వేయడాన్ని ఆమె క్రింజ్ ’ (Cringe) గా ఫీలైందని, అందుకే ఆయనను ‘ఫేక్ సింగ్’ అంటూ ఓ రేంజ్‌లో తక్కువ చేసిందని  ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు.

పాత పగలే కారణమా? 

గతంలో వీరిద్దరి మధ్య ఉన్న పాత పగలను మనసులో పెట్టుకుని, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడమే ఆమె అసలు టార్గెట్  అని, అందుకే ఇలాంటి ‘డబుల్ మీనింగ్’ పోస్ట్‌లతో రాజకీయ, సినీ వర్గాల్లో ప్రకంపనలు  పుట్టిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పూనమ్ దృష్టిలో రణ్‌వీర్ ‘రియల్’ అయితే, పవన్ ‘ఫేక్’ నా? అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ అసలు తట్టుకోలేకపోతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ మీద పూనమ్ కౌర్ కు ఉన్న కోల్డ్ వార్  ఏంటో అందరికీ తెలిసిందే అయినా, ఇలా ఒక సిక్కు క్యారెక్టర్ పేరుతో ఆయన్ని టార్గెట్ చేయడం మాత్రం ‘నెక్స్ట్ లెవల్’ షేడ్ అనే చెప్పాలి.

క్లారిటీ లేని పూనమ్.. మంటలు పెడుతున్న సోషల్ మీడియా!

Advertisement

ఈ వివాదంపై పూనమ్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ, ఆమె వదిలిన కామెంట్స్  మాత్రం సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయ్ . పూనమ్ ఈ పోస్ట్‌తో పవన్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ వేయాలని చూస్తోందా? లేక తన కమ్యూనిటీని గౌరవించని వారిని నిలదీస్తోందా? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సస్పెన్స్. మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా? లేక పూనమ్ మరిన్ని ‘ఫ్యాక్ట్స్’ (Facts) తో పవన్ కళ్యాణ్ పరువు తీస్తుందా? అనేది వేచి చూడాలి!

read also :Rudraveena Controversy: వెంకటేష్ టైటిల్ పై కన్నేసిన మెగాస్టార్? ఆ శాపమే సినిమాను ముంచేసిందా?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×