E-Paper
Advertisement

Mark K Robin: గద్దర్ అవార్డ్ అందుకున్న మార్క్ కె రాబిన్ స్పందనిదే.. డ్రీమ్ ఏంటో తెలుసా?

Mark K Robin: గద్దర్ అవార్డ్ అందుకున్న మార్క్ కె రాబిన్ స్పందనిదే.. డ్రీమ్ ఏంటో తెలుసా?

Mark K Robin: చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దది చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే రోజులివి. అలాంటిది ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించి కూడా, తన ప్రొఫైల్‌ని బయటికి అంతగా రానివ్వని మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ (Music Director Mark K Robin). దాదాపు 8 ఏళ్ల సంగీత ప్రస్థానంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు మార్క్ కె రాబిన్. నాగార్జున ‘ది ఘోస్ట్’, ప్రియదర్శి ‘మల్లేశం’, తేజ సజ్జా ‘జాంబీరెడ్డి’, తాప్సీ ‘మిషన్ ఇంపాజిబుల్’, నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రాలకు సంగీతం అందించిన మార్క్ రాబిన్‌ పేరు ఈ మధ్య బాగా వైరల్ అయింది. అందుకు కారణం ‘దండోరా’ (Dhandoraa) చిత్రం. ఈ సినిమాకు అందించిన సంగీతానికిగానూ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్‌ (Gaddar Award)తో సత్కరించింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంగీత దర్శకుడి పేరు బాగా వైరల్ అవుతోంది. తనకు గద్దర్ అవార్డు వరించడంపై తాజాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

Also Read- Peddi Movie: ‘పెద్ది’ సినిమా చూడాలంటే.. ముందు ‘దేవర’ కథ తెలియాలి.. ఇదేంటిది?

కథాంశమే ఇన్స్‌పైర్ చేసింది

‘‘దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గద్దర్ అవార్డ్ దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులకు మరింత మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ఒక స్ఫూర్తిగా ఈ అవార్డ్ నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. గద్దర్ అవార్డ్‌తో సంగీత దర్శకుడిగా నాపై మరింత బాధ్యత పెరిగింది. గద్దర్ అవార్డ్ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ‘దండోరా’ డైరెక్టర్ మురళి చాలా క్లారిటీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని కథాంశమే నన్ను మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ఇన్స్‌పైర్ చేసింది. కులాల మధ్య ఉన్న అడ్డుగోడలు, చివరకు చనిపోయాక అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా అడ్డుకోవడం, ఒక బ్రిడ్జి మీద నుంచి శవాలను నీటిలోకి దింపడం వంటివి దర్శకుడు చెప్పాక.. నిజంగా నా మనసు చలించింది. భావోద్వేగం నిండిన మనసుతోనే ఆ సినిమాకు సంగీతాన్ని అందించాను.

Also Read- Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్ లో శర్వానంద్.. అసలు విషయం బయటపెట్టిన హీరో!

నా డ్రీమ్ అదే..

నాకు కమర్షియల్ సినిమాలు చేయడమంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ వర్క్ నాని మజ్ను సినిమాకు చేశా (ట్రైలర్‌కు బీజీఎం ఇచ్చాను). అది కమర్షియల్ మూవీ. స్టార్ హీరోల చిత్రాలకు ఎలాంటి బీజీఎం ఇవ్వాలనేది పూర్తిగా అవగాహన ఉంది. ప్రభాస్ కోసం కొన్ని బీజీఎంలు రెడీ చేసి పెట్టాను. మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాకు మ్యూజిక్ చేయాలనేది నా డ్రీమ్. ఇటీవల గద్దర్ అవార్డ్స్‌లో ఆయనను కలిసి దగ్గరగా చూశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆ సందర్భం ఒక స్వీట్ మెమొరీగా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం ‘కథాకళి’ అనే ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ప్రశాంత్ వర్మతో రెండు మూవీస్ చేస్తున్నాను. ఒక స్టార్ హీరో సినిమాకు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తాను’’ అని చెప్పుకొచ్చారు.

Also Read- Rowdy Janardhana: పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ .. రౌడీ జనార్ధన పై భారీ హైప్!

Related News

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

Big Stories

×