Poonam Kaur: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన వారిలో నటి పూనమ్ కౌర్(Poonam Kaur) కూడా ఒకరు. ఈమె సినిమాలలో నటించింది చాలా తక్కువ ఇక ఈమె నటించిన సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈమె హీరోయిన్ గా మాత్రమే కాకుండా సపోర్టింగ్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఇలా హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలోను హీరో చెల్లెలి పాత్రల్లో కూడా పూనమ్ నటించారు. ఇకపోతే ఇటీవల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులు, వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.
పూనమ్ కౌర్ నిత్యం టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేస్తూ వరుస పోస్టులు పెడుతూ ఉంటారు. తన జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశారు అంటూ ఈమె ఎన్నో సందర్భాలలో ఆరోపించారు. ఇదివరకు పూనమ్ చేసే పోస్ట్ ఎవరిని ఉద్దేశించి చేశారో అర్థం కాని విధంగా పోస్ట్ చేసేవారు కానీ ఇటీవల మాత్రం నేరుగా త్రివిక్రమ్ పేరును ఉద్దేశించి పోస్టులు పెట్టడంతో హాట్ టాపిక్ గా మారింది. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్న పూనమ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా తన పెళ్లి గురించి ప్రస్తావనకు రావడంతో పూనమ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఓసారి ఈమె కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో కనిపించడంతో త్వరలోనే మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి కదా అంటూ ప్రశ్న ఎదురవడంతో పూనమ్ సమాధానం చెబుతూ నాకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది, అబార్షన్ కూడా చేసేసారు, అలాగే నా పిల్లలు ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెరుగుతున్నారు. నాకు ఒక్కసారి కాదు చాలాసార్లు పెళ్లిళ్లు చేసేసారు మీడియా వారు అంటూ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈమె పెళ్లి, పిల్లలు గురించి వస్తున్న వార్తలను ఘాటుగా ఖండించారు.
ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు..
ఇలా తన పెళ్లికి సంబంధించి తన ప్రమేయం లేకుండా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఈ వార్తలపై పూనమ్ స్పందిస్తూ చెక్ పెట్టారు. ఇక ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు.. ఇక గతంలో తనకు ఇండస్ట్రీలో జరిగిన అన్యాయం గురించి మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ,అలా ఎందుకు పట్టించుకోలేదో ఇప్పటికి తనకు అర్థం కాని విషయం అంటూ మరోసారి ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
Also Read: Poonam Kaur: పూనమ్ కౌర్ పై చేతబడి..పెద్ద యాక్సిడెంట్.. మొహం పై 18 ఇంజెక్షన్లు