IPL 2026-KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) ప్రారంభం కంటే ముందే కేకేఆర్ జట్టుకు కొత్త టెన్షన్ మొదలైంది. రూ.9.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ఓ ప్లేయర్, ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో ఆడేది డౌట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ దేశానికి చెందిన ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman) ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఆడేది కష్టమే అని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అతడు ఐపిఎల్ 2026 టోర్నమెంట్ ఆడితే పెద్ద గొడవలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కు కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ కు చెందిన స్టార్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman) ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ఆడడంపై సందిగ్ధత నెలకొంది. బంగ్లాదేశ్ లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురిని అత్యంత కిరాతకంగా చంపినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో సేవ్ బంగ్లా హిందూస్ అనే నినాదం తెరపైకి వచ్చింది. అంతేకాదు ఐపీఎల్ టోర్నమెంటులో బంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి ప్లేయర్లను ఆడించకూడదని హిందువులు డిమాండ్ చేస్తున్నారు.
ఆ బంగ్లాదేశ్ కు చెందిన ప్లేయర్లు ఇక్కడ ఆడితే, మ్యాచ్ లను అడ్డుకుంటామని వార్నింగ్లు కూడా ఇస్తున్నారు. ముస్తాఫిజుర్ రహమాన్ ను కేకేఆర్ జట్టు నుంచి ముందుగా తొలగించాలని కోరుతున్నారు. దాంతో పాటు షారుఖ్ ఖాన్ లాంటి ముస్లింను కూడా ఆ జట్టు నుంచి తరిమి కొట్టాలని హిందువులు డిమాండ్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ దేశ ద్రోహి అంటూ కూడా కొంతమంది ఫైర్ అవుతున్నారు. దీంతో రూ.9.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ముస్తాఫిజుర్ రహమాన్ వచ్చే సీజన్ లో ఆడతాడా ? లేదా? అనే టెన్షన్ లో కేకేఆర్ యాజమాన్యం ఉంది. ఒకవేళ అతడు ఆడకపోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. నిజంగానే ముస్తాఫిజుర్ రహమాన్ ను తప్పిస్తే, ప్రత్యామ్నాయ ప్లేయర్ కోసం కూడా ఇప్పటి నుంచి వేట మొదలుపెట్టిందట కేకేఆర్.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament ) ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman) ఆడడంపై బీసీసీఐకి చెందిన ప్రతినిధి స్పందించారు. బంగ్లాదేశ్ ప్లేయర్లను ( Bangladesh players) బ్యాన్ చేయాలంటూ కేంద్రం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవని ఆయన వెల్లడించారట. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి అలాంటి ఆదేశాలు వస్తే కచ్చితంగా బంగ్లాదేశ్ ప్లేయర్లను ( Bangladesh players) బ్యాన్ (Ban) చేస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Three-time IPL Champion KKR's move to buy Mustafizur Rahman for Rs 9.20 crore for the upcoming IPL season in an auction held in December drew sharp reactions from multiple corners, with Hindu religious preachers and BJP leaders calling Khan a "traitor" and Congress supporting the… pic.twitter.com/5Gkkgj7lYe
— IndiaToday (@IndiaToday) January 2, 2026