E-Paper
Advertisement

Poonam Kaur: న్యూ*డ్ ఫోటోలు రిలీజ్ చేస్తామన్నారు.. పోసాని వల్లే అంతా!

Poonam Kaur: న్యూ*డ్ ఫోటోలు రిలీజ్ చేస్తామన్నారు.. పోసాని వల్లే అంతా!
Advertisement

Poonam Kaur: ‘మాయాజాలం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న పంజాబీ బ్యూటీ పూనమ్ కౌర్ (Poonam Kaur) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.. తన అందం, అభినయంతో ఆడియన్స్ హృదయాలను దోచుకున్న ఈమె…ఈమధ్య కాలంలో సినిమాలు చేయకపోయినా కాంట్రవర్సీ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తోంది. ముఖ్యంగా ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తనను మోసం చేశాడని, తనకు అన్యాయం చేశాడని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తోంది.

త్రివిక్రమ్ నా జీవితాన్ని నాశనం చేశాడు..

ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన జీవితాన్ని నాశనం చేశారని, ఇటీవల మా అసోసియేషన్ లో కూడా ఆమె ఫిర్యాదు చేసింది . అయితే తన ఫిర్యాదును వారు తీసుకోలేదని వాపోగా.. తమకి ఎటువంటి ఫిర్యాదులు అందలేదని.. ఏదైనా సమస్య ఉంటే నేరుగానే వచ్చి కలవండి అని కోశాధికారి శివ బాలాజీ స్పష్టం చేశారు ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తూ తన అభిప్రాయాన్ని చెబుతూ వస్తోంది.

న్యూ*డ్ ఫోటోలు రిలీజ్ చేస్తామని బెదిరించారు..

Advertisement

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చే ఈమె.. తొలిసారి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.అందులో ఎన్నో విషయాలను బయటపెట్టిన ఈమె.. తన న్యూడ్ ఫోటోలు రిలీజ్ చేస్తామని బెదిరించారని, అలాగే పోసాని వల్లే తన జీవితం నాశనమైందని, తన పెళ్లి జరగకుండా ఆగిపోయింది అంటూ సంచలన కామెంట్లు చేసింది పూనమ్ కౌర్. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..” రాజకీయ లబ్ధి కోసం కొన్ని పొలిటికల్ పార్టీలు నన్ను వాడుకోవాలని చూశాయి. ముఖ్యంగా నన్ను బెదిరించాయి. నాకు డబ్బులు, పదవులు కూడా ఆఫర్ చేశారు. ఆఖరికి ఒక యాక్టర్ కి నేను వ్యతిరేకంగా మాట్లాడకపోతే.. నా న్యూ*డ్ వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేస్తామని బెదిరించారు..

నా పెళ్లి కూడా ఆగిపోయింది..

నా ఫ్రెండ్ ని నేను వివాహం చేసుకోవాలనుకున్నాను. కానీ సడన్గా అదే సమయంలో పోసాని కృష్ణ మురళి ప్రెస్ మీట్ పెట్టారు. ఇక దాంతో నా పెళ్లి కూడా ఆగిపోయింది. అప్పుడే మా అమ్మకు గుండెపోటు కూడా వచ్చింది. పోసాని వల్లే నా వ్యక్తిగత జీవితం కూడా నాశనమైంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పూనమ్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

రాహుల్ గాంధీతో ఎఫైర్ పై క్లారిటీ..

Advertisement

ఇకపోతే రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీతో రిలేషన్ పై మాట్లాడుతూ.. నేను రాహుల్ గాంధీ పార్టీకి క్లోజ్ అని, అతడి ప్రేమలో ఉన్నానని వార్తలు రాశారు..ఒకవేళ నేను అతడితో క్లోజ్ గా ఉంటే ఢిల్లీలో నా పనికి సంబంధించిన పనులను ఆపేవారా? నాకొచ్చిన అవకాశాలను ఇంకొకరికి ఇచ్చేవారా? ఒకవేళ నేను ఏదైనా పార్టీకి సపోర్టుగా ఉంటే నా జీవితం ఎలా ఉండేది కాదు కదా.. పొలిటికల్ లీడర్స్ కి దగ్గరగా ఉన్న అమ్మాయిలకు ఎప్పటికీ ఏం కాదు.. ఎవరైతే దూరంగా ఉంటారో వారి గురించే చెడుగా మాట్లాడుతారు అంటూ చెప్పుకొచ్చింది.

ALSO READ: Venuswamy: వేణుస్వామికి గట్టి కౌంటర్ ఇచ్చిన హీరోయిన్.. పూజకు ఫలితం లభించలేదా?

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×