E-Paper
Advertisement

Poonam Kaur: పవన్ కళ్యాణ్‌పై మరో బాంబ్ పేల్చిన పూనమ్ కౌర్.. ఈసారి టార్గెట్ పిల్లలు!

Poonam Kaur: పవన్ కళ్యాణ్‌పై మరో బాంబ్ పేల్చిన పూనమ్ కౌర్.. ఈసారి టార్గెట్ పిల్లలు!
Advertisement

Poonam Kaur: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ, రాజకీయ వర్గాల్లోనూ సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటి ఎవరయ్యా అంటే, వెంటనే వినిపించే పేరు పూనమ్ కౌర్ (Poonam Kaur). తాజాగా పూనమ్ కౌర్ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ చర్చకు తావిస్తోంది. ఎప్పుడూ పేరు ప్రస్తావించకుండా కామెంట్స్ చేసే పూనమ్.. ఈసారి పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పిల్లలను లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించడంతో.. ఏపీ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ఆమె మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాల గురించి, ఇంకా ఇటీవల వైసీపీ నాయకులు వెంకటేశ్వర స్వామి చిత్రాలు ప్రదర్శించడంపై.. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో గళమెత్తుతున్న తరుణంలో.. ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు ఆమె రిప్లయ్ ఇచ్చారు. ఇందులో ఆయన వ్యక్తిగత జీవితం, పిల్లల మతం గురించి పూనమ్ లేవనెత్తిన ప్రశ్నలు చర్చనీయాంశమయ్యాయి.

Also Read- Spirit Villain: ‘స్పిరిట్’ విలన్‌గా డాన్ లీ? క్లారిటీ వచ్చేది ఆ రోజేనా?

పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

Advertisement

అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ముస్లిం, క్రిస్టియన్స్ అయితే ఇలా జరిగి ఉండేవి కాదు. కేవలం హిందువులకే ఐక్యత ఉండదు కాబట్టి, హిందువుల ఓట్లు లాక్కోవడం చాలా ఈజీ అని భావించి, అలా చిత్ర పటాలను అసెంబ్లీలో ప్రదర్శించారు. ఇస్లాం, క్రిస్టియానిటీ అయితే కచ్చితంగా ఇలా జరిగేది కాదు. ముందు హిందువులు మారాలి. వాళ్లు మారనంత వరకు వెంకటేశ్వర స్వామి కాకపోతే, శివుడు, లేదంటే అమ్మవారు.. ఇలా విడగొట్టి ముక్కలు ముక్కులుగా కులాలతో రాజకీయాలు చేస్తారు.. అని చెబుతున్నారు. దీనికి ఓ నెటిజన్ .. కమ్యూనిస్ట్ మైండ్ సెట్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా అయిపోయాడు ఏంటో? అంటూ కామెంట్ చేశాడు. దీనికి పూనమ్ కౌర్ స్పందిస్తూ..

Also Read- Virosh wedding: రష్మిక విజయ్ పెళ్లి..ఉదయ్ పూర్ చేరుకున్న టాలీవుడ్ సెలెబ్రిటీలు!

విదేశాలకు వెళ్లగానే కాస్ట్యూమ్స్ మారిపోతాయా?

Advertisement

‘‘మూడు నెలల వయసులోనే విదేశాలకు తీసుకెళ్లి పిల్లలకు బాప్టిజం ఇప్పించి, తన వారసత్వాన్ని ఆర్థోడాక్స్ క్యాథలిక్ క్రైస్తవంలోకి ఎందుకు మార్చారు? హిందువుగా ఉండటం అంటే కేవలం రాజకీయ డ్రామా కోసం ఆ కాస్ట్యూమ్స్ ధరించడమేనా? విదేశాలకు వెళ్లగానే ఆ కాస్ట్యూమ్స్ మారిపోతాయా?’’ అంటూ ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో హిందుత్వం, సనాతన ధర్మం చుట్టూ జరుగుతున్న చర్చల నేపథ్యంలో.. రాజకీయ లబ్ధి కోసం ధర్మాన్ని వాడుకుంటున్నారా అనే కోణంలో ఆమె ఈ విమర్శలు గుప్పించినట్లుగా అర్థమవుతోంది. పూనమ్ కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అందులో ఒక వర్గం ఆమె వ్యక్తిగత విషయాలను రాజకీయం చేస్తోందని విమర్శిస్తుంటే, మరో వర్గం మాత్రం ఒక నాయకుడిగా పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిపై స్పష్టత ఉండాలని వాదిస్తున్నారు. గతంలో కూడా పూనమ్ కౌర్ పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తీరును తప్పుబడుతూ ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి ఏకంగా మతం, పిల్లల అంశాన్ని తీసుకురావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చూద్దాం.. ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో..

Also Read- Sarkaar Season 6 Promo: అబ్బబ్బ.. ఏం పెట్టల్ని పట్టుకొచ్చార్రా! ఈసారి ర్యాంపేజ్ ఫిక్స్!

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×